Plastic Bottles and Health Risks: Shocking Study
ప్లాస్టిక్ బాటిల్స్ అంత ప్రమాదమా..? నివేదికలో షాకింగ్ విషయాలు
ప్లాస్టిక్ బాటిళ్లు ప్రమాదకరమని పలు అధ్యయనాలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్లాస్టిక్ బాటిళ్ల నుండి వచ్చే నానోప్లాస్టిక్లు మన ఆరోగ్యానికి నిజంగా హానికరమని భారతీయ పరిశోధన స్పష్టం చేసింది.
ప్లాస్టిక్ బాటిళ్లు చాలా తేలికగా ఉంటాయి. అందువల్ల ప్రయాణంలో వీటిని తీసుకెళ్లడానికి సులభంగా ఉంటుంది. దాదాపు చాలా మంది ఎక్కడికి వెళ్ళినా తమతో పాటు ఖచ్చితంగా ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకెళ్లుతారు. అయితే, ఈ బాటిళ్లను ఉపయోగించడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటిళ్లు ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
అధ్యయనం ప్రకారం.. దీర్ఘకాలం నానోప్లాస్టిక్లకు గురికావడం వల్ల మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదల తగ్గుతుంది. వాటి రక్షణ శక్తి బలహీనమవుతుంది. ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నయం చేయడం కష్టతరం చేస్తుంది. రక్తంలో ప్రభావం చూపుతుంది. ఎర్ర రక్తకణాల మెంబ్రేన్ను దెబ్బతీస్తాయి. అంతేకాకుండా DNA, కణాలపై ప్రభావం ఉంటుంది. కణాలు అకాలంగా చనిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి, ఈ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
