
Gram Panchayat,
వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కంఠాత్మకూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో డెంగ్యూ, మలేరియా,టైఫాయిడ్ విష జ్వరాల బారిన పడకుండా గ్రామంలో ప్రజలను అప్రమతము చేయుట లో భాగంగా ప్రజలు ఇంటి పరిసరాలు శుభ్రముగా,పిచ్చి మొక్కలు ఇతర నీరు నిల్వ ఉండకుండా పడవేసిన డబ్బాలు ఇతర వ్యర్ధ ప్లాస్టిక్ వస్తువులు కొబ్బరి బోండాలు ఏ ఇతర వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా దోమలు నివారణలో భాగంగా కంఠాత్మకూరు గ్రామంనకు డ్రై డే ఫ్రైడే లో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి హనుమకొండ ఎల్.లక్ష్మీ రమాకాంత్ ఇంటి పరిసరాలను పరిశీలించి సూచనలు సలహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.వీరి వెంట సిహెచ్ రవి,మండల పంచాయతీ అధికారి నడికూడ బి.భార్గవి పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది,ఏఎన్ఎం ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.