హసన్ పర్తి/ నేటి ధాత్రి
హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎర్రగట్టు గుట్ట వద్ద అక్రమంగా పి డి ఎస్ బియ్యం విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుదవారం రాత్రి 290 క్వింటాళ్ల బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. దీంతో పాటు ఒక ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న వారిలో సమ్మయ్య, శిరిగిరి, మౌతం, వీరయ్య, మధుకర్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.