టియుడబ్ల్యూజె(ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు క్యాతం సతీష్, సామంతుల శ్యామ్
భూపాలపల్లి నేటిధాత్రి
ఐజెయు అనుబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) జర్నలిస్ట్ హౌసింగ్, వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా వల్లాల వెంకటరమణ ని నియమించడం పట్ల భూపాలపల్లి జిల్లా టీయూడబ్ల్యూజే(ఐజేయు)జిల్లా కమిటీ పక్షాన అభినందనలు తెలుపుతున్నామన్నారు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్యాతం సతీష్,సామంతుల శ్యామ్ ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం మాట్లాడుతూ హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన రమణ మూడు దశాబ్దాలకు పైగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు.జర్నలిస్టు సంఘంలో గతంలో ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులుగా, సంయుక్త కార్యదర్శిగా, కోశాధికారిగా, నాలుగుసార్లు ప్రధాన కార్యదర్శిగా, రాష్ర్ట కార్యవర్గ సభ్యులుగా, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా పనిచేసారు. వివిధ పత్రికల్లో, మీడియాలో పనిచేసిన రమణ ప్రస్తుతం మన తెలంగాణ దినపత్రిక ప్రత్యేక ప్రతినిధిగా కొనసాగుతున్నారని, రాష్ట్ర కన్వీనర్ గా నియమించడం పట్ల మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఇతర యూనియన్ పెద్దలకు భూపాలపల్లి జిల్లా టియుడబ్ల్యూజే(ఐజేయు) శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు. అందరిని కలుపుకుని సంఘం అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తారని,జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం విషయంలో బాధ్యతాయుతంగా పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజేయు రాష్ట్ర హెల్త్ కమిటీ మెంబర్ సామల శ్రీనివాస్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏటా వీరభద్రస్వామి, కోశాధికారి చింతల కుమార్ యాదవ్, ఐజేయు అనుబంధం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష,కార్యదర్శులు సాంబయ్య, రమేష్ తో పాటు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.