
వీణవంక,(కరీంనగర్ జిల్లా),
నేటి ధాత్రి: వీణవంక మండల పరిధిలోని లస్మక్కపల్లి గ్రామానికి చెందిన ధర్మ స్టూడెంట్ యూనియన్ మండల కన్వినర్ గా వినయ్ నియమించినట్లుగా అలాగే జమ్మికుంట కు సాగర్ ను నియమించారు. ధర్మ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కో కన్వీనర్ సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్ర కులాల నిరుపేద వర్గాల విద్యార్థులకు రాజకీయ రంగంలో సమాన వాటా,రాజకీయ చైతన్యం, విద్యార్థుల సమస్యలు,అన్ని ప్రైవేట్ రంగంలో ఉన్న స్కూల్ లు, కాలేజీలు, యూనివర్శిటీ లలో రిజర్వేషన్ లు సాధించడమే లక్ష్యంగా (డీ ఎస్ యు) విద్యార్ధి సంఘం పనిచేస్తుందనీ తెలిపారు. సాగర్ వినయ్ లు మాట్లాడుతూ … తమపై విశ్వాసం ఉంచి మండలాల బాధ్యులుగా ఎన్నుకుందుకు రాష్ట్ర కమిటీ కి ధన్యవాదాలు తెలిపారు. వీణవంక జమ్మికుంట మండలాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.