
Prajavani examined immediately.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి
భూపాలపల్లి నేటిధాత్రి
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ నిర్వహించారు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసం సమర్పించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో 22 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.