అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
* ప్రిన్సిపల్ జన్ను విజయ్ కుమార్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ విద్య శాఖ ఆదేశాల మేరకు అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం చేస్తున్నామని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జన్ను విజయ్ కుమార్ ఒక ప్రకటనలో సోమవారం రోజున తెలిపారు. మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల లో 2025 -2026 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న కంప్యూటర్స్ విభాగంలో రెండు పోస్టులు, ఎకనామిక్స్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నాయని ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల లోపు కళాశాలలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు రెండు జతలు జిరాక్స్ కాపీలు సమర్పించవలసిందిగా తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులు పొంది ఉండాలని ఇతరులు 55 శాతం మార్కులు పొంది ఉండాలని సంబంధిత సబ్జెక్టుల్లో అర్హతలు పీజీ తో పాటు నెట్, సెట్, పీహెచ్డీ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జన్ను విజయకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.