Appani Srinivas Supports New Labor Codes
తప్పుడు ఆరోపణలు చేస్తున్న కార్మిక సంఘాలు
అప్పాని శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి ఏరియా సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో, భూపాలపల్లి ఏరియా ఉపా ధ్యక్షులు వెలబోయిన రజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ సి ఎంకెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
అప్పాని శ్రీనివాస్ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన నాలుగు కార్మిక చట్టాల కోడ్లు కార్మికులందరికీ అనుకూలంగా ఉండడంతో బి ఎం ఎస్ కార్మిక సంఘం వాటిని పూర్తిగా సాగదీస్తుంది భారత దేశంలో అసంఘటిత, వలస, గిగ్, ప్లాట్‌ఫారమ్ అనధికార రంగాలు దాదాపు 40 కోట్ల మంది కార్మికులకు తొలిసారిగా చట్టబద్ధమైన సామాజిక భద్రత వ్యవస్థలోకి రావడం. ఈ కోడ్ల అత్యంత కీలకమైన ప్రయోజనమని గ్రహించాలి.
వేజ్ కోడ్ కనీస వేతన హక్కు
సకాలంలో, పారదర్శకంగా జీతం చెల్లింపు సమాన పనికి సమాన వేతనం
బోనస్, అలవెన్సులపై స్పష్టమైన నియమాలు డిజిటల్ మీడియాలో కాంట్రాక్ట్ / స్ట్రింగర్ / ప్రాజెక్ట్ బేస్డ్ పనిచేసే వారికి ఇది అతిపెద్ద భద్రతా కవచం.
ఏమి మారింది? పాత్రికేయ నిర్వచనం విస్తృతమైంది
ఇప్పటివరకు “వర్కింగ్ జర్నలిస్ట్” అనే పదం ప్రధానంగా
ఇప్పుడు ఆ నిర్వచనం విస్తరించి మూడు పెద్ద రంగాలనూ జతచేసుకుంది:
డిజిటల్ / ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్
టీవీ న్యూస్ & ఎలక్ట్రానిక్ మీడియా
రేడియో / ఎఫ్ఎం / కమ్యూనిటీ రేడియో పాత్రికేయులు
ఫలితంగా డిజిటల్-ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లపై వార్తా కంటెంట్ తయారుచేసే అతిపెద్ద వర్గం ఇక అధికారికంగా కార్మిక రక్షణ పరిధిలోకి వచ్చేసింది. ముందస్తు లేఖలు
ధర్నాలు-నిరసనలు
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖతో చర్చలు
పార్లమెంటరీ కమిటీలకు సూచనలు కొత్త కోడ్ డ్రాఫ్ట్‌లపై అభ్యంతరాలు
ఈ అన్ని కృషే ఈ మార్పుకు పునాది వేశాయి. అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వెలబోయిన సుజెందర్ బ్రాంచి ఉపాధ్యక్షులు. పాండ్రాల మల్లేష్ పని రమేష్ కొత్తూరు మల్లేష్ రఘుపతి రెడ్డి అన్నం శ్రీనివాస్. తాండ్ర మొగిలి. దాసరి ఓదెలు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
