
Apadbandhavulu Foundation Helps Seriously Ill Child
ఆపద్బాంధవులు ఫౌండేషన్ ద్వారా చిన్నప్పటి నుంచి అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న బాలుడి కుటుంబానికి సహాయం.
చందుర్తి, నేటిధాత్రి:
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో జగదీష్ కుటుంబానికి కుటుంబానికి మన ఆపద్బాంధవుల ఫౌండేషన్ తరపున వెయ్యి మంది సహకారంతో ఈరోజు సహాయం చేయడం జరిగింది.
జగదీష్ కుమాడు పుట్టిన మూడు నెలల బేబీ అప్పటినుండి, ఇపుడు రెండు సంవత్సరాల వయస్సు వరకు కూడా నయం కాకపోవడం. విపరీతమైన జ్వరం మరియు విపరీతంగా ఏడుస్తూ ఉన్న సందర్భంలో హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ప్రాబ్లం అలాగే ఉండడం వల్ల జ్వరం తగ్గకపోవడం వల్ల అనేక హాస్పిటల్స్ సిరిసిల్ల జిల్లాలోని హాస్పిటల్ మరియు కరీంనగర్ అలాగే హైదరాబాద్ టాటా హాస్పిటల్ లో బేబీకి వైద్యం అందిచడం జరిగింది అయినా జ్వరం తగ్గక ప్రతి 6 గంటలకు ఫీవర్ రావడం తో, బ్లడ్ టెస్ట్, బోన్మరో క్యాన్సర్ టెస్ట్ కూడా చేశారు, కానీ బాధపడుతున్న బాలుడికి తెల రక్త కణాలు 18000, 30000, అలా ఉండడం అధిక జ్వరంతో బాధపడుతూ ఉండడం జరుగుతుంది, ఇప్పటివరకు కూడా పరిస్థితులు అలాగే ఉండడం వల్ల ఆ కుటుంబం ఆర్ధికంగా చాలా దుర్పరస్థితికి వెళ్లిపోవడం జరిగింది.
ఇది తెలుసుకున్న మన అపద్బాంధవుల ఫౌండేషన్ తరపున ఆ యొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం మరియు 14 రకాల సరుకులు అందించడం జరిగింది ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలితో అలమట్టిస్తున్న వారి ముడుపోయిరాళ్లపైన నాలుగు అన్న మెతుకులై వారి కడుపు నింపడమే మా యొక్క ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం.