నర్సంపేట , నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతున్నదని,ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలుకు నోచుకోవడంలేదని ఎంసిపిఐ (యు ) జిల్లా నాయకుడు కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు.ఈ మేరకు శనివారం నర్సంపేటలో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లపెంపు,గృహజ్యోతి,రైతుబంధు, రైతు రుణమాఫీ లాంటి ఏ ఒక్క పథకం కూడా అమలు నోచుకోలేదని ఆరోపించారు.రైతుల భూములను అక్రమంగా లాక్కునే చర్యలకు దిగుతున్న రేవంత్ రెడ్డి అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక మొదలైందన్నారు.బడా కంపెనీలకు రైతుల భూములను అప్పనంగా అప్పగించేందుకు ప్రభుత్వం చూస్తున్నదని,ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.