జిల్లా లో అవినీతి నిరోధక వారోత్సవాలు

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా లో అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ర్యాలీని ప్రారంభించరు..
డిసెంబరు 3 నుండి 9వ తేదీ వరకు అవినీతి నిరోధక వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతాయి. ఈ సందర్భంగా గురువారం జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ లైన్ స్కూల్ నుండి తెలంగాణా చౌరస్తా వరకు అవినీతి వ్యతిరేక ర్యాలీని నిర్వహించరు.
ఈ ర్యాలీలో ఏసీబీ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు. అవినీతి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, సమాజంలో పారదర్శకతను పెంపొందించేందుకు పౌరులంతా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ఎస్పీ అన్నారు. అవినీతిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ ముఖ్య పాత్ర పోషిస్తుందని మరియు స్ఫూర్తిదాయకమైందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ, లింగస్వామి, ఎంఈవో లక్ష్మణ్ సింగ్, పోలీస్ లైన్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ శంభుప్రసాద్, ఆర్వీఎంఓ, బాలు యాదవ్, ఏసీబీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!