మంచిర్యాల,నేటి ధాత్రి:
మంగళవారం రోజున మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తన కార్యాలయంలో ప్రెస్ మీట్గ్ నిర్వహించి చెన్నూరు నియోజకవర్గం లోని ఇసుక రీచ్ ల వార్షిక నివేదికను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జైపూర్ మండలం లోని ఎలకంటి ఇసుక రీచ్ లో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిఏ రమణారావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని,ఈ విషయమై ఇప్పటికే వివరణ ఇచ్చామనీ,కాని కొందరు ఇప్పటికీ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.అక్రమ ఇసుక రవాణా వార్త కథనాల పై మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించి పూర్తి ఆధారాలతో,వాస్తవాలను మాత్రమే రాయాలని కలెక్టర్ సూచించారు.గతంలో వేలాల ఇసుక రీచ్ లో జరిగిన అవకతవకల నేపథ్యంలో నలుగురు ఉద్యోగులను విధుల్లోంచి తొలగించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.ఇసుక అక్రమ రవాణా విషయం లో ప్రజలు గాని మీడియా ప్రతినిధులు గాని అధికారుల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు చేపడతామని,వారిని కఠినంగా శిక్షిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.