
అంజనీపుత్ర ఛైర్మన్ గుర్రాల శ్రీధర్
నూతన సంవత్సరం లో ప్రజలందరికీ శుభం జరగాలని నూతన ఆవిష్కరణ లు జరగాలని మంచిర్యాల జిల్లా అంజనీపుత్ర ఛైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎం డీ పిల్లి రవి పేర్కొన్నారు. బుధ వారం అంజనీపుత్ర సంస్థ ఆధ్వర్యంలో 2024 సంవత్సర డైరీ, క్యాలెండర్ చైర్మెన్ గుర్రాల శ్రీధర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ క్యాలెండర్ దినచర్యను సూచిస్తాయని ఇవి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగేందుకు దోహదపడతాయన్నారు. క్యాలెండర్ బేస్ చేసుకుని చాలా మంది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారన్నారు. నూతన సంవత్సరం లో ప్రతీ ఒక్కరికీ శుభం జరగాలని ఆకాంక్షించారు.నూతన ఆవిష్కరణలు జరగాలని కోరారు . సంస్థ సేవలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అంజనీపుత్ర సంస్థ గుర్తింపు సాధించడం సంతోష దాయకమన్నారు.ఈ కార్యక్రమం లోఎగ్జిక్యూటవ్ డైరెక్టర్ లు ఎస్ కిషన్, జీ. సంతోష్, అంజనీపుత్ర సంస్థ డైరెక్టర్ లు, కస్టమర్లు, ప్రజలు పాల్గొన్నారు..