
వినాయక దేవుళ్లకు వినతి పత్రం
13వ రోజు కొనసాగిన సమ్మె
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి ;
అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ ని పర్మినెంట్ చేయాలని,కనీస వేతనాలు రూ 26 వేలు ఇవ్వాలని, అదనపు పని భారాన్ని తగ్గించాలని సిఐటియు జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనుంజయ గౌడ్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దోటి వెంకన్నపిలుపునిచ్చారు
శనివారం అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె 13వ రోజు కొనసాగింది. అంగన్వాడి సమస్యలను పరిష్కారం కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు బుద్ధి ప్రసాదించాలని కోరుతూ చండూరు మండల కేంద్రంలోర్యాలీ నిర్వహించి, అనంతరంవినాయక దేవుళ్లకు వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మంది అంగన్వాడి టీచర్లు మరియు హెల్పర్ల సమస్యల పరిష్కారానికి అనేక రూపాలలో ఆందోళన నిర్వహించినప్పటికీ ప్రభుత్వ స్పందించకపోవడంతో సమ్మె చేయాల్సి వచ్చిందని అన్నారు. గత 48 సంవత్సరాలకు పైగా అంగన్వాడీ కేంద్రాలలో పని చేస్తున్న టీచర్స్,హెల్పర్స్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని,పని భారాన్ని పెంచుతూ,సంబంధం లేని పనులను కూడా అప్పగిస్తున్నదని అన్నారు . కనీస వేతనం,ESI,PF, బెనిఫిట్స్ ఇవ్వాలని పదే పదే ప్రభుత్వాన్ని కోరుతూ అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చినా,దశల వారీ ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పశ్చిమ బెంగాల్,
అస్సాం,కర్ణాటక రాష్ట్రాలలో పై సౌకర్యాలు అమలు చేస్తున్నారని అన్నారు.గుజరాత్ రాష్ట్రం లో సుప్రీం కోర్టు చెప్పినట్లు గ్రాట్యుటీ చట్టం అమలు జరుగుతున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పై రాష్ట్రాలలో అమలు జరుగుతున్న ఏ సౌకర్యాలు అమలు చేయడం లేదని అన్నారు. అంగన్వాడి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అంగన్వాడీ యునియన్లతో జరిగిన సమావేశం లో ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రకటనలను చేశారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడీ వర్కర్ పేరుని టీచర్ గా మార్పు చేశారని,కానీ అంగన్వాడీ జీవితాల్లో ఏ మార్పు రాలేదని అన్నారు.తమిళనాడు,పాండిచ్చేరి,అస్సాం,కర్ణాటక రాష్ట్రాలలో అంగన్వాడీ లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, హెల్త్ కార్డ్ లను ఇచ్చారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లో పని చేస్తున్న అంగన్వాడీ సమస్యలపై పరిష్కారానికి సమ్మె చేస్తున్న సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలనివారు అన్నారు..
ఈ కార్యక్రమం లో కేదారి, బరిగేల రమణమ్మ,నాగమణి, తారక, రాజేశ్వరి, శోభ,జగదీశ్వరి, పి జ్యోతి, వనజాత, ఉష, పద్మ, సునీత, పి.సునీత,విజయనిర్మల,భాగ్యలక్ష్మి,పార్వతమ్మ,వెంకటమ్మ,ఆయాలుసుగుణమ్మ, సుజనా, కృష్ణవేణి, సోనీ, సాయమ్మ, రాణి, నిర్మలమ్మ, అండాలు తదితరులు పాల్గొన్నారు.