anganvadi kendralathone chinnarula abhivruddi, అంగన్‌వాడీ కేంద్రాలతోనే చిన్నారుల అభివద్ధి

అంగన్‌వాడీ కేంద్రాలతోనే చిన్నారుల అభివద్ధి

అంగన్‌వాడీ కేంద్రాలలో అందించే పోషక ఆహార పదార్థాల వలన చిన్నారులు అభివద్ధి చెందారని అంగన్‌వాడీ కార్యకర్త నల్ల భారతి అన్నారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని 4వ అంగన్‌వాడీ కేంద్రంలో ఏఎల్‌ ఎస్‌ఎంసీ చైర్మన్‌ వాసం కవిత ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులు, తల్లులతో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్లా భారతి మాట్లాడుతూ 3 నుండి 5సంవత్సరాల చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. అంగన్‌వాడి కేంద్రాలలో పోషకాలతో కూడిన భోజన వసతులు పాలు, కోడిగుడ్డు అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులు శారీరకంగా, మానసికంగా ఎదగడం కోసం ఆటలు, పాటల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి.గౌసియాబేగం, సునీత, కమిటీ సభ్యులు రవళి, కవిత, సనాతోపాటు చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!