తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్న.
మోడీ తెలంగాణ ప్రజలంటే ఎందుకు వివక్ష.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య.
చిట్యాల, నేటి ధాత్రి :
కేంద్రంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బిజెపి మిత్ర రాష్ట్రాలకు ప్రజలకు వరాలజల్లు కురిపించేలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రిక్త శూన్య హస్త్రాలు అందించేలా ఉందని , జయశంకర్ భూపాలపల్లి జిల్లా
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య అన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఇతర రాష్ట్రాలకు వరాల జల్లు కురిపించి తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నే నాని
కేంద్ర ప్రభుత్వం 35 రకాల అంశాలపై విభజన చట్టంలో హామీలు ఇచ్చారని వాటిని పూర్తిగా ఇప్పటివరకే బడ్జెట్లో విస్మరించాలన్నారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై సవితి తల్లి ప్రేమను చూపిస్తుందని విభజన హామీలలో ముఖ్యమైన బయ్యారం ఉక్కు పరిశ్రమ. కాజీపేట రైల్వే కోచ్ పారిశ్రామ .గిరిజన యూనివర్సిటీ. హైదరాబాద్ నగరంలో విద్యా పారిశ్రా సంకేతిక సౌకర్యాలు లాంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం బాధాకరమని. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కలుపుతూ పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు విషయాన్ని బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు కోతలు కోసే రాష్ట్ర బిజెపి నాయకులు కేంద్ర బడ్జెట్ పై, తెలంగాణ ప్రజలకు చేసిన మేలుపై 8 మంది ఎంపీలు నోరు మెదపలని డిమాండ్ చేశారు పేద మధ్యతరగతి వర్గాల కేంద్ర బడ్జెట్ వలన ఒరిగిందేమీ లేదు అన్నారు బంగారం ధరను నామ మాత్రంగా తగ్గించడం వలన పేద మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుందన్నారు ఐటి నమ్ముకుని ఉద్యోగాలు చేసిన మధ్యతరగతి వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని స్లాబ్ పద్ధతిలో ట్యాక్స్ విధించడం వలన నష్టపోయేది మధ్యతరగతి వారే అన్నారు ధనికులకు బడా పారిశ్రామిక వేత్తలకు తమకు మద్దతిస్తున్న రాజకీయ నాయకులకు రాష్ట్రాలకు మేలు జరిగేలా పక్షపాతంలో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టడం శోచనీయమని తెలిపారు ఒకరకంగా చెప్పాలంటే ఆంధ్రకు వరాల జల్లు తెలంగాణ ముఖాన వరద చందంగా కేంద్ర బడ్జెట్ ఉందని ద్వయపట్టారు.