నులి పురుగులతో అనర్ధాలు

-20న నులిపురుగుల నివారణ దినం

-ఆరోగ్యవంతమైన జీవితానికి ఆల్బెండజోల్ మాత్రలు

-19 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరి

-అంగన్వాడీ టీచర్లు మరియు ఆశా వర్కర్ల అవగాహన సదస్సులో డాక్టర్ పోరండ్ల నాగరాణి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
ఆరోగ్యవంతమైన జీవితాన్ని పిల్లలకు అందించడం తల్లిదండ్రులు తమ కర్తవ్యంగా భావించాలని, భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యవంతంగా తయారైతే వారిలో నైపుణ్యాభివృద్ధి పెంపొందుతుందని, అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని, పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత తగ్గించడం, శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడునందించడం ఆరోగ్య సమాజ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నులి పురుగుల (నట్టల) నిర్మూలన దినోత్సవాన్ని (ఎన్ డీ డీ నేషనల్ డివార్శింగ్ డే) నిర్వహిస్తున్నదని, ఇందులో భాగంగానే ఈనెల 20న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని 1 నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెంజడోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఆరోజు ఏదేని కారణం చేత అర్బెండజోల్ మాత్రలు వేసుకోలేని పిల్లల కోసం ఈనెల 27న మాపప్ డే రోజున కచ్చితంగా ఆల్బెంజడోల్ మాత్రలు వేయించేలా చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో మొగుళ్లపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ ఫోరండ్ల నాగరాణి సూచించారు. ఈనెల 20న అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడి సెంటర్లు, ప్రైవేట్ స్కూల్లలో మరియు ఇతర సంస్థల్లో 1 నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేయాలని, అలాగే నులిపురుగులు తయారవడం వల్ల పిల్లల ఎదుగుదల లోపిస్తుందని, పిల్లలలో రక్తహీనత, ఏకాగ్రత లోపించడం, వికారం, విరోచనాలు, ఆకలి లేకపోవడం, కడుపులో నొప్పిరావడం లాంటివి ఏర్పడతాయని తెలిపారు. పిల్లలకు పరిసరాల పరిశుభ్రత, మల, మూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కునే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఈ నెల 20న నిర్వహించబోయే నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు, ఆరోగ్య సిబ్బంది అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పల్లె దవఖాన వైద్యాధికారులు డాక్టర్ సంధ్య, సరళ, యాస్మిని, వాణి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటస్వామి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయపాల్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ సునీత, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, అన్ని సబ్ సెంటర్ల ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!