పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

●లక్కారం లో 2005 —2006, SSCబ్యాచ్
●18 సంవత్సరాల తరువాత ఒక్క చోట కలిసిన మిత్రులు

ముత్తారం :- నేటి ధాత్రి

లక్కారం గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2005-06 SSC బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.18 సంవత్సరాల క్రితం తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువుల అడ్రస్సులు సేకరించి ఒకే వేదిక పై వారిని ఏకం చేసి వారికి స్వాగతం పలికారు..అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గత స్మృతులను నెమరువేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాల తీపి కబుర్లు, తమ అనుబంధాలను స్మరించుకున్నారు.తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు, కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ, సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఆనందోత్సాహాలతో గడిపారు.పూర్వ విద్యార్థులు అధ్యపకులకు శాలువాలతో, మెమొంటోస్ తో ఘనంగా సన్మానించారు.18 సంవత్సరాల తర్వాత వివిధ ప్రాంతాల్లో స్థిర పడ్డటువంటి మిత్రులందరికీ ఒక దగ్గరికి చేర్చటువంటి ప్రయత్నం చేసిన పూర్వ విద్యార్థులు బర్ల జ్యోతి, లావణ్య, కోమలత, శ్రీలత, సంధ్య, తిరుమల, రజిత, శైలజ, స్వరూప, కవిత కుమార్, శ్రీనివాస్ రాజు సతీష్ శ్రీను రూపేష్ నాగరాజు నరేష్ మహేష్,రవీందర్,ప్రభాకర్,స్వామి,పోషలు, ప్రసాద్ ,రమేష్,శ్రీనివాస్ ,అధ్యాపకులతో పాటు పూర్వ విద్యార్థులు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా విచ్చేసిన, మాజీ ఎంపీపీ, అత్తే చంద్రమౌళి, మాట్లాడుతూ, పాఠశాల అధ్యాపకులను శంకర్ లింగం, చంద్రయ్య, బర్ల.శ్రీనివాస్, విజయలక్ష్మి గురువులను గత 18 సంవత్సరాల క్రితం పదవ తరగతి విద్యను బోధించిన తమను గుర్తు పెట్టుకుని ఆప్యాయంగా ఆహ్వానించడం గొప్ప విషయమని అన్నారు. వారి వద్ద క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు ఇతర బిజినెస్ రంగాలలో స్థిరపడి మరి కొంతమందికి సహాయం చేసే స్థాయిలో నిలబడినందుకు వారిని అభినందిస్తూ ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!