ప్రయాణానికి కుదరని ముహూర్తం..!

Bridge work completed

ప్రయాణానికి కుదరని.

ముహూర్తం..!

• బ్రిడ్జి పనులు పూర్తి.. ప్రారంభం ఎప్పుడో..?

• ముస్తాబైన ఆర్ ఓబీ, తొలగని అడ్డంకులు

• ఏడేండ్లుగా ప్రజలకు తప్పని నిరీక్షణ

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ పట్టణ పరిధిలో రహదారిపై నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం కుదరడం లేదు. అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రయాణికులకు అందుబాటులోకి తేవడానికి సిద్ధంగా ఉన్నా, నిర్లక్ష్య వైఖరితో అందుబాటులోకి తేవడం లేదు. పనులు పూర్తై నెలలు గడుస్తున్నా, రాకపోకలకు అడ్డంకులు తొలగడం లేదు. సరైన ముహూర్తం కుదరకనా, లేక కాంట్రాక్టర్ కు ఉన్న ఆర్థిక ఇబ్బందులో కానీ, ఏడేండ్లుగా ప్రయాణికుల నిరీక్షణకు మాత్రం తెర పడడం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రయాణికులు ఇంకా ఊరిస్తూనే ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ముస్తాబైనా ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. పనులు పూర్తై నెలలు గడుస్తున్నా రాక పోకలకున్న అడంకులు మాత్రం తొలగడం లేదు. సరైన ముహూర్తం కుదర కానా, లేక కాంట్రాక్టర్ కు ఉన్న ఆర్థిక ఇబ్బందులో కానీ ఏడేండ్లుగా ప్రయాణికుల నిరీక్షణకు మాత్రం తెర పడడం లేదు. దీంతో రాకపోకల సందర్భంగా రైల్వే గేటు వల్ల ఇబ్బందులు ఎదురైన ప్రతిసారి ప్రయాణికులు పరస్పరం ప్రభుత్వ ప్రతినిధులు, అధికార గణాల తీరుపై తమ అసహనం వ్యక్తం చేయడం కనిపిస్తోంది.

ఏడేండ్ల క్రితం శంకుస్థాపన..

రైల్వే గేటు వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బం దుల పరిష్కారానికి అప్పటి ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)ను మంజూరు చేశారు. 2018 ఆగస్టు 30న రూ.90 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. వెంటనే రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. అప్పటి నుంచి అగుతూ సాగుతూ నేటివరకు పసులు కొనసాగుతూనే ఉన్నాయి. జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి క్రాస్ రోడ్డులో గల రైల్వేలెవల్ క్రాసింగ్ వద్ద ప్రయాణికుల రాకపోకల కోసం ఏడేళ్ల క్రితం డబుల్ లైన్ ఆర్వోబీ పనులు చేపట్టారు. నిధుల కొరత తదితర కారణాలతో ఎప్పటికప్పుడు పనులు తరచూ వాయిదా పడుతూ, కొనసాగుతున్నాయి.

ముస్తాబైన ముహూర్తం మెప్పుడో..?

జహీరాబాద్ పట్టణ పరిధిలో రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. అన్ని విధాలుగా ముస్తాబై నెలలు గడుస్తున్నా ముహూర్తం మాత్రం కుదరడం లేదు. అందుకే రాక పోకలకు ముహూర్తం అడ్డంకులు తొలగడం లేదని బహటంగానే ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. స్థానిక లెవల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి నాందేడ్, పూర్ణ, షిరిడీకి, బెంగళూరు. తిరుపతి, కాకినాడ పట్టణాలకు ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. అంతే కాకుండా గూడ్స్ రైళ్ల కూడా ఎక్కువ సంఖ్యలోనే వచ్చిపోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేట్లు మూసేయడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. స్థానికులతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతిసారి అత్యధికంగా అరగంట పాటు గేటు వద్ద ఆగాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.

స్థానికులకు.. ప్రయోజనమే.

Bridge work completed
Bridge work completed

 

ఈ రహదారి గుండా రాకపోకలు సాగించే మొగు డంపల్లి, జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల ప్రయాణికులతో పాటు కర్ణాటకలోని చించోళీ, గుల్బర్గా, బసవకల్యాణ్, బీదర్ ప్రయాణికులతో సహా పట్టణ శివారులోని డ్రీమ్ ఇండియా, బందే అలీ, బాబూమోహన్ కాలనీ, మహీంద్రా, ఎంజీ, ముంగి, బూచినెల్లి పారిశ్రామిక వాడలకు రాకపోకలు సాగించే వారికి ఎంతో మేలు జరుగునుంది. బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల్లో జాప్యంతోనే పనులు సకాలంలో పూర్తి లేదనేది వాస్తవ సత్యం. ఫైనాన్షియల్ అడ్డంకులు తొలిగి బ్రిడ్జి పనులతో పాటు రోడ్ వైడ్నింగ్, డివైడర్,సర్వీస్ రోడ్లు. వాటికి రంగులు వేయడం తదితర పనులన్నీ పూర్తిచేశారు. వెంటనే ప్రారంభానికి అవస రమైన చర్యలు తీసుకోవాలని ఇందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని స్థానిక, ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!