రోజుకో ఆపిల్.. నిజంగా మంచిదేనా..

రోజుకో ఆపిల్.. నిజంగా మంచిదేనా..

 

 

రోజుకో ఆపిల్ తినడం వల్ల నిజంగా ఆరోగ్యంగా ఉంటారా? అయితే, ఏ సమయంలో తినడం ఆరోగ్యానికి మంచిది? దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

‘రోజుకు ఒక యాపిల్ తింటే.. డాక్టర్ అవసరం లేదు’ అనేది ఒక సాధారణ సామెత. ఇది యాపిల్ లోని పోషక విలువలు, ఆరోగ్యానికి కలిగే మేలును సూచిస్తుంది. యాపిల్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకో యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అల్పాహారం తిన్న ఒక గంట తర్వాత యాపిల్ తింటే ప్రయోజనం ఉంటుంది. యాపిల్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, రోజుకో యాపిల్ తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

యాపిల్ ఆరోగ్య ప్రయోజనాలు

  • యాపిల్‌లో ఉండే ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
  • దీనిలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఉపయోగపడుతుంది.
  • యాపిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.
  • యాపిల్‌లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
  • దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
  • యాపిల్‌లో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
  • యాపిల్‌ నమలడం వల్ల దవడ, దంతాలు బలంగా మారతాయి. అలాగే, నోటిలో లాలాజలం ఉత్పత్తిని పెంచి, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • కాబట్టి, రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, సమతుల్య ఆహారంలో భాగంగా రోజుకు ఒకటి లేదా రెండు ఆపిల్స్ తినడం మంచిదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!