పాలకుర్తి నేటిధాత్రి
పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన గాదేపాక కొమురయ్య అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలను ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జీడి హరీష్ లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన బండి భగవంత్ గౌడ్ కి ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మృతుడి కుటుంబ సభ్యులు గాదేపాక కుమార్, గాదేపాక మధు పాల్గొన్నారు.