· ఎదురుదెబ్బలు తిని రాటుతేలిన నేత
· ఎన్నికల మేనేజ్మెంట్ స్కిల్‌లో తిరుగులేని ధీశాలి
· కలిసొచ్చిన గుజరాత్లో మోదీతో కలిసి అమలు చేసిన వ్యూహానుభవం
· కేంద్రంలో పార్టీని అధికారంలోకి తేవడానికి అనుక్షణం తపించిన నిబద్ధ నేత
· ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడు
· కక్ష కట్టి గుజరాత్‌నుంచి బహిష్కరించినా, తిరుగులేని నేతగా ఎదిగిన వైనం
· గుజరాత్లో లేనప్పుడు ఉత్తరప్రదేశ్‌పై అవగాహన పెంచుకున్న షా
· ఫలితంగా యుపీలో బీజేపీ విజయభేరి
· 370 అధికరణాన్ని తొలగించడంలో అమేయ పాత్ర పోషణ
· కాంగ్రెస్ వల్ల పేరుకున్న మకిలిని తొలగించే పనిలో క్రియాశీలకం
హైదరాబాద్, నేటిధాత్రి:
గుజరాత్‌లోని గాంధీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆయన లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిసున్న అమిత్ అలీచంద్ర షా 2019 నుంచి దేశానికి 32వ ీVAం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా రు. అంతేకాకుండా 2021 జులై నుంచి తొలి సహకారశాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. 2014 నుంచి 2020 వరకు భారతీయ జన తాపార్టీ పదవ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాదు 2014 నుంచి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌కు ఛైర్మన్‌గా కొనసాగారు. 2017`2019 మధ్యకాలంలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన బీజేపీకి ప్రధాన వ్యూహకర్త మాత్రమే కాదు, ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితులు.
1997‘2012 వరకు గుజరాత్‌లోని సర్ఖేజ్ నియోజకవర్గం నుంచి, 2012‘17 మధ్యకాలంలో నారన్‌పుర స్థానంనుంచి గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2002 నుంచి 2012 వరకు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీ మంత్రివర్గంలో ీVAం, న్యాయశాఖ, జైల్లు, సరిహద్దు భద్రత, పౌరరక్షణ, ఎక్సైజ్, ీVAంగార్డ్స్, రవాణా, మద్యనిషేధ అమలు, గ్రామపరిరక్షక దళం, పోలీసు గహనిర్మాణం, శాసన మరియు పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వ ర్తించారు. విద్యార్థిదశలో ఏబీవీపీ సభ్యుడిగా కొనసాగారు. 18వ ఏటనే ఏబీవీపీలో ఒక స్థాయికిచేరుకున్న ఆయన 1987లో బీజేపీలో చేరారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ‘ఇన్చార్జ్గా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాల్లో 73 సీట్లను బీజేపీ గెలుచుకొని అప్రతిహత విజయాన్ని నమోదుచేసి, అమిత్ షా చాణక్యానికి గుర్తుగా నిలిచింది. దీంతో ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఆయన తన తొలి రెండేళ్ల పదవీకాలంలో మహారాష్ట్ర, హర్యానా, జమ్ము‘కశ్మీర్, జార్ఖండ్, అ స్సాం ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించినా, 2015లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ, బిహార్ లో మాత్రం పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్త రాఖండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాలో పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. అదే ఏడాది జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అకాలీదళ్‘బీజేపీ అలయన్స్ అధికారాన్ని కోల్పోయింది. 2018 అ సెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చత్తీస్గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటమిపాలై విపక్ష స్థానానికి పరిమితమైంది.
1964, అక్టోబర్ 22న ముంబయిలో గుజరాతీ హిందూ బనియా కుటుంబంలో అమిత్ షా జ న్మించారు. ఆయన ముత్తాత మానస నగర శ్రేష్టిగా వుండేవారు. గాంధీనగర్ జిల్లాలో ప్రస్తుతం ఇదొక మున్సిపాలిటీ. అప్పట్లో మనస సంస్థానంగా వుండేది. ఈ సంస్థానంలో మానస ఒక ప్ర ముఖ పట్టణం. దీన్ని రాజ్‌పుత్‌లు పాలించారు. అమిత్ షా తండ్రి మానస పట్టణానికి చెందిన ఒక వ్యాపారి. ఆయనకు పీవీసీ పైప్‌ల వ్యాపారం వుండేది. మానసనే మేహసాన అని కూడా వ్యవహరించేవారు. ఇక్కడే అమిత్ షా పాఠశాల విద్యను పూర్తిచేసి తర్వాత అహమ్మదాబాద్‌లో ఆ యన సీయూ షా సైన్స్ కాలేజీలో బయో కెమిస్ట్రీలో బ్యాచ్‌లర్ డిగ్రీ పూర్తిచేసి, తండ్రి వ్యాపారంలో సహాయంగా వుండేవారు. తర్వాత ఆయన స్టాక్ బ్రోకర్‌గా, కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో పనిచేశారు. అమిత్ షా భార్యపేరు సోనాల్ షా. ఈ దంపతులకు జయ్ షా కుమారుడు. అమిత్ షాకు ఆరుగురు అక్కచెలెళ్లుండగా వీరిలో ఇద్దరు చికాగోలో నివిసిస్తున్నారు. 2010, జూన్ 8న అమిత్ షా తల్లి అనారోగ్యంతో కన్నుమూసారు.
చిన్నతనం నుంచే ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాý£్గనేవారు. పిన్నవయస్సులోనే ఇరుగుపొరుగు ప్రాంతాల్లో శాఖ కార్యక్రమాýకు చురుగ్గా హాజరయ్యేవారు. అహమ్మదాబాద్‌లో డిగ్రీ చుదువుకునే రోజుల నాటికి ఆయన 1982లో ఆరఎసఎస్ స్వయం సేవక్‌గా మా రారు. అప్పట్లో ప్రస్తుత ప్రధాని మోదీ ఆరఎసఎస్ ప్రచారక్‌గా నగరంలో యూత్ కార్యకలాపాలకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తుండేవారు. అప్పటినుంచి నరేంద్రమోదీ ఈయనకు బాగా పరిచయమయ్యారు. తర్వాత మోదీ సూచన మేరకు 1983లో ఆయన అఖిలభాతర విద్యార్థి పరిషత్ (ఆరఎసఎస్ రాజకీయ విభాగం)లో చేరారు. చివరకు 1987లో భారతీయ జనతాపార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. విచిత్రమేంటంటే ఈయన చేరిన ఏడాదికి నరేంద్రమోదీ బీజేపీలో సభ్య త్వం తీసుకోవడం విశేషం. తర్వాత బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చా లో కార్యకర్తగా చేరారు. బీజేవైఎం అధికార క్రమంలో ఆయన తాలూకా స్థాయి నుంచి రాష్ట్రస్థా యిలో జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. 1991లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వరిష్ట నేత లాల్కష్ణ అద్వానీ పోటీచేసినప్పుడు, అమిత్షాలోని పోల్ మేనేజ్మెంట్ నైపుణ్యం బయటపడింది.
1995లో మొట్టమొదటిసారి గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఏరాటై కేశూభాయ్ పటేల్ ముఖ్య మంత్రి అయ్యారు. అప్పట్లో కాంగ్రెస్‌కు గుజరాత్ గ్రామీణ ప్రాంతాలు పెట్టని కోటగా వుండేవి. దీన్ని దెబ్బకొట్టడానికి నరేంద్రమోదీ, అమిత్‌షాలు ఒక ప్రణాళిక రూపొందించి, ప్రతి గ్రామంలో రెండోస్థాయి పలుకుబడి నాయకుడిని బీజేపీలో చేరేలా ప్రోత్సహించారు. ఆవిధంగా 8వేల అ త్యంత పలుకుబడి కలిగిన గ్రామీణ నాయకత్వ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయగలిగారు. ఇదే వ్యూ హాన్ని అనుసరించి రాష్ట్ర సహకారసంఘాల్లో కూడా బలమైన నాయకత్వాన్ని నిర్మించారు. 1999లో అమిత్‌షా దేశంలోనే అతిపెద్ద అహమ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నిక య్యారు. అప్పటికి రూ.36కోట్ల నష్టంతో నడుస్తున్న బ్యాంక్‌ను కేవలం ఏడాది కాలంలోనే రూ. 27 కోట్ల లాభాన్ని ఆర్జించే స్థాయికి తీసుకెళ్లారు. 2014 నాటికి బ్యాంక్ ఏకంగా సుమారు రూ.250 కోట్ల లాభాల్లో వుంది. 2009లో అమిత్ షా గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్`ప్రెసిడెంట్ అయ్యారు. దీనికి మోదీ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. 2014లో మోదీ ప్రధాని అయ్యాక, షా ఈ సంస్థకు ప్రెసిడెంట్ అయ్యారు.
1990 ప్రాంతంలో పార్టీ రాష్ట్రశాఖకు మోదీ జనరల్ సెక్రటరీగా వున్నకాలంలో, అమిత్ షాపై అత్యధిక ప్రభావాన్ని కలిగించారు. మోదీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్‌ను ఒప్పించి గుజరాత్ స్టేట్ ఫై నాన్సియల్ కార్పొరేషన్‌కు షాను ఛైర్మన్‌గా ఎంపిక చేయించారు. తర్వాత శంకర్‌సింగ్ వాఘేలా వంటి పార్టీ నాయకులు, మోదీకి ప్రభుత్వంలో ఎక్కువగా వేలుపెడుతున్నారంటూ అధినాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో, ఆయన్ను ఢిల్లీకి పిలిపించారు. 1995`2001 మధ్యకాలంలో మోదీ ఢిల్లీలో పనిచేసినప్పుడు, షా ఆయనకు గుజరాత్లో అత్యంత నమ్మÅ£స్తుడిగా వ్యవహ రించారు. 1997లో మోదీ లాబీయిజం చేసి గుజరాత్ షేర్కెజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఇప్పించారు. ఈ ఎన్నికల్లో షా గెలిచి మొదటిసారి అంసెంబ్లీ గడప తొక్కారు. మళ్లీ 1998 ఎన్నికల్లో ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
అసమర్థ నాయకత్వమన్న అపప్రధ రావడంతో 2001లో పార్టీ అధిష్టానం గుజరాత్ ముఖ్యమం త్రి పదవినుంచి కేశూభాయ్ పటేల్‌ను తప్పించి నరేంద్రమోదీని ముఖ్యమంత్రిగా పంపింది. త ర్వాతి కాలంలో మోదీ, షా ద్వయం తమ ప్రత్యర్థులను క్రమంగా అడ్డు తొలగించుకుంటూ వ చ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పనిచేసిన 12ఏళ్ల కాలంలో అమిత్ షా గుజరాత్లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. మోదీ ప్రభుత్వంలో అనేక మంత్రిపదవులను పొందిన అతి పిన్నవయస్కుడిగా షా గుర్తింపు పొందారు. ఒకదశలో ఆయన 12 పోర్ట్‌పోలియోలను నిర్వహించడం విశేషం. గుజరాత్ ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియస్ బిల్లును మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టేలా షా కషిచేశారు. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మతమార్పిడులకు అడ్డుకట్టపడింది. 2010 జులైలో సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌం{ర్ కేసులో అరెస్టయ్యారు. అప్పటికి ఆయన ము ఖ్యమంత్రి పదవికి గట్టిపోటీదారు స్థాయికి ఎదిగారు. ఈ అరెస్ట్ ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి. అరెస్టయిన మూడు నెలల తర్వాత 2010 అక్టోబర్ 29న హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆ మరునాడు జస్టిస్ అఫ్తాబ్ అలామ్ ఒక పిటిషన్ స్వీకరించి, అమిత్ షాను గుజరాత్‌నుంచి బహిష్కరించారు. దీంతో 2010`12 మధ్యకాలంలో అమిత్ షా బలవంతంగా గుజరాత్ బయట వుండాల్సి వచ్చింది. ఈ రెండేళ్ల కాలంలో ఆయన తన భార్యతో కలిసి ఢిల్లీలోని గుజరాత్ భవన్‌లోని ఒక గదిలో గడిపారు. ఎట్టకేలకు 2012 సెప్టెంబర్‌లో సు ప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన తిరిగి గుజరాత్ వచ్చారు. అదే ఏడాది నరాన్పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అప్పటికి డీలిమిటేషన్ కారణం గా సర్ఖెజ్ నియోజకవర్గాన్ని తొలగించారు. 2014లో సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ఆయన పాత్ర వున్నట్టు ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పడంతో కేసునుంచి విము క్తమయ్యారు.
మోదీ ప్రధాని అయ్యాక జాతీయ రాజకీయాల్లో అమిత్ షా ఎంతో పేరుప్రఖ్యాతులు సంపాదిం చుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఆయన పోల్మేనేజ్మెంట్ “అపర చాణిక్యుడి”గా పేరుతెచ్చిపెట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 100మిలియన్ సభ్యత్వాల మార్క్‌ను బీజేపీ దా టింది. 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఆయన వ్యూహచతురత ఎంతగానో పనిచేసింది. మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించినవి 312! ఆయ మొత్తం 18 రోడ్‌షోలు, 161 బహిరంగసభలు, 1500 బీజేపీ సమావేశాలు నిర్వహించారు. ఆయన ీVAం మంత్రిగా జమ్ము`కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 అధికరణం తొలగింపు, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్`2019, క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లు`2022, బిల్లులు ప్రవేశ పెట్టి పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందేలా చేయగలిగారు. ఒకరకంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అపర చాణిక్యుడే అమిత్ షా!
