Ambedkar’s 69th Anniversary Marked in Mangapet Villages
భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి. ఆర్. అంబేద్కర్ గారి 69 వ వర్ధంతి సందర్బంగా ఘనమైన నివాళులు*
డా బి. ఆర్.అంబేద్కర్ గారి 69 వర్ధంతి సందర్బంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం (రి. నెo. 184/85) మంగపేట మండల అధ్యక్షులు యెంపెల్లి వీరాస్వామి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో 69 వ వర్ధంతి సందర్బంగా అంబేద్కర్ విగ్రహాల దగ్గర,పుస్పాలు, పూలమాలల తో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది.
తిమ్మంపేట అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షులు దుర్గం శివప్రసాద్, మరియు ప్రధాన కార్యదర్శి బోడ శివ ఆధ్వర్యంలో తిమ్మంపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మంగపేటలో అంబేద్కర్ సంఘం మండల నాయకులు దాసరి ఎల్లన్న ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కమలాపురంలో అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షులు దాసరి బుజ్జి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించి సమావేశం నిర్వహించి ప్రజాస్వామిక, అభ్యుదయ వాదులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు, ఉద్యమకారులు అంబేద్కర్ ఆలోచన విధానం పై, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎదురకొంటున్న సమస్య లపై మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
