
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
జాతీయ అంబేద్కర్ సంఘం కుదురుపల్లి గ్రామ శాఖ అధ్యక్షునిగా గూగుల్ నాగేందర్ ను నియమించడం జరిగింది. సోమవారం రోజు మండల అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో గ్రామ శాఖ కార్యవర్గానికి ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి నాగరాజు సహాయ కార్యదర్శి రాజేందర్ కోశాధికారి రత్నం నాగరాజు కార్య నిర్వహణ సెక్రటరీ మధుకర్, 15 కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడ్డ జాతీయ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లో తీసుకువెళ్లడమే లక్ష్యంగా సంఘం ముందుకు వెళుతుందని, భారతదేశ మహానాయుని ఆశయాలను కొనసాగించే అవకాశం ఇచ్చినందుకు సంఘం మండల అధ్యక్షుడు అలాగే జాతీయ అధ్యక్షులకు కుదురుపల్లి గ్రామ శాఖ నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది.