
ఎంపీటీసి
ఎండపల్లి,నేటి ధాత్రి
పాఠశాలకు రంగులు వేయించి అందంగా , రూపు దిద్దిస్తున్న ఎంపిటిసి నీ,పలువురు విద్యాభిమానుకు అభినందిస్తున్నారు, జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని అంబారిపేట గ్రామ ప్రాథమిక పాఠశాల భవనానికి ఎంపీటీసీ నిధులు (15 వ ఆర్థిక సంఘం) నిధులతో అంబారిపేట ఎంపీటీసీ సభ్యురాలు జాడి సుజాత రాజేశం రంగులు వేయించారు. దీంతో పాఠశాల భవనమంతా కొత్త శోభతో అలరిస్తుంది. చాలాకాలంగా పాఠశాల భవనానికి పెయింటింగ్ లేక కళ తప్పిన భవనానికి రంగులు వేయించి, కొత్త శోభను తీసుకువచ్చిన ఎంపీటీసీ సభ్యురాలుకు గ్రామస్తులు,విద్యాభిమానులు అభినందనలు తెలిపారు.