
*తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్..
*ఈనెల 24, 25, 26వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు..
*శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు.
తిరుపతి(నేటి ధాత్రి)
తిరుపతిలో ఈనెల 24, 25, 26వ తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి ఛాంపియన్షిప్-2025 పేరుతో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 29న జరగనున్న నేషనల్ స్పోర్ట్స్ డేలో భాగంగా రాష్ట్రస్థాయి పోటీలకు తిరుపతి ఆతిధ్యమిస్తుందని తెలియజేశారుజిల్లా స్థాయి, జోనల్ స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు చేరుకున్నారని వివరించారు. రాష్ట్రస్థాయిలో హాకీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ, బాక్సింగ్, వెయిట్లిఫ్టింగ్అథ్లెటిక్స్, ఆర్చరీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పోటీల్లో 2వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. క్రీడాశాఖామంత్రి రాంప్రసాద్ రెడ్డి, క్రీడాశాఖ ఉన్నతాధికారులు హాజరవనున్నట్లు పేర్కొన్నారు. 29వ తేదీన విశాఖపట్టణంలో జరిగే నేషనల్ స్పోర్ట్స్ డేకు సీఎం చంద్రబాబునాయుడు ముఖ్య అతిధిగా విచ్చేస్తారని, రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలకు సీఎం చేతులు మీదుగా నగదు ప్రోత్సాహకాలుపతకాలు అందజేస్తామని స్పష్టం చేశారు.