
Alumni Reunion at Jharasangam ZP High School
ఝరాసంగం లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝారాసంగం మండల కేంద్రంలోని స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 1998-99 మధ్య చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులందరు ఒకరినొకరు పలుకరించుకుంటూ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి జ్ఞాపికలను అందజేశారు.
పాఠశాలకు ఫర్నిచర్‌ను అందజేశారు. పూర్వ విద్యార్థులు గురువులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఫోటోలు దిగి మధుర స్ర్ముతులను నెమరువేసుకున్నారు.ఈ సమ్మేళనంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు,