
విద్యార్థుల కొరకు మేధాసూక్త పారాయాణం ప్రతి రోజు జాతరను తలపిస్తున్న సాలగ్రామ సన్నిధి
ముడుపులు కడితే కోర్కెలు తీరడం తో దర్శనం కొరకు క్యూ కడుతున్న భక్తజనం
భద్రాచలం నేటి రాత్రి
భద్రాచలం : భద్రాద్రి దివ్య క్షేత్రం లో కొలువై ఉన్న కల్పవృక్ష నారసింహుని దివ్య సన్నిధి ప్రతి నిత్యం భక్తులరాకతో జాతరను తలపిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకున్న వారికి కోర్కెలు నెరవేరుతున్నాయని ఆనోటా ఈనోటా విని ప్రతి నిత్యం ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అనేక గ్రామాల నుండి భక్తులు రావడం స్వామి వారికి ముడుపులు చెల్లించడంతో సాలగ్రామ ఆశ్రమం సందడి గా మారింది. ఈరోజు మాఘ బహుళ పంచమి ని పురస్కరించుకొని స్వామి వారికి విశేష తిరుమంజనం జరిగినది. ఈ సందర్బంగా ఆశ్రమం నిర్వాహకులు డా. కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ లక్ష్మీనారసింహుని వర ప్రసాదమైన కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దర్శనం కొరకు వచ్చే భక్తులకు ప్రతి నిత్యం నృసింహ సేవా వాహిని ద్వారా సేవలందిస్తున్నామని అన్నారు. ప్రతి నిత్యం సుదూర ప్రాంతాలనుండి వచ్చే భక్తులకు నృసింహ భక్తకుటుంబం ద్వారా అన్న ప్రసాదాన్ని అందిస్తున్నామని అన్నారు. అలానే నేటి నుండి 40 రోజులపాటు విద్యార్థులకొరకై మేధాసూక్తపారాయణం,హయగ్రీవార్చన, సరస్వతి హోమం నిర్వహించ నున్నామని అవకాశం ఉన్నవారు స్వామి వారిని దర్శించి తరించాలని అన్నారు. లోకం లో విద్యను మించిన ఆయుధం మరొకటి లేదని, లోకానికి వెలుగులు పంచే శక్తి విద్యకు మాత్రమే ఉన్నదని అందుకే లోకమంతా బాగుండాలనే సంకల్పం తో గత 6 సంవత్సరాలనుండి విద్యార్థులకొరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో ఆశ్రమం నిర్వాహకులు డా కృష్ణ చైతన్య స్వామి, శ్రీధర్ శర్మ,అర్చకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.