https://epaper.netidhatri.com/
గులాబీ పరిమళం గుభాలింపే
సారు సర్కారు కావాల్సిందే.
ముచ్చటగా మూడోసారి సిఎం అవుతున్నారంతే.
రైతులంతా కేసిఆర్ వైపే.
పింఛన్ దారులకు కేసిఆర్ పెద్దకొడుకే
అన్ని వర్గాలు కోరుకుంటోంది కేసిఆర్ నే.
కోరికోరి కష్టాలు తెచ్చుకోలేమంతే…
కాంగ్రెస్ కు పాలన చేత కాదు.
కొట్లాటలకే కాలం సరిపోదంతే.
జనం నాడీ ఇది…కేసిఆర్‌కు జై కొడుతుంది.
సర్వేలన్ని చెబుతున్నది ఇదే…
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బిఆర్‌ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. తెలంగాణలోని ఎవరిని కదలించినా ఇదే మాట..తెలంగాణలో ఎన్నికలపై డిప్యాక్. నేటిధాత్రితో సహా కనీసం ఓ యాభై సర్వేలు జరిగి వుంటాయి. వాటన్నింటిలో వచ్చింది..జనం చెప్పింది ఒకటే మాట. ఈసారి కూడా అధికారం బిఆర్‌ఎస్‌దే. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వం మీద ప్రజలకు అపారమైన నమ్మకం వుంది. తెలంగాణ కోసం కొట్లాడి సాధించిన నాయకుడు కేసిఆర్‌కు వున్న చిత్తశుద్ది తెలంగాణ మీద ఎవరికీ వుండదన్నది ప్రజలు చెబుతున్న మాట. తెలంగాణ పల్లెల్లో ఏ వ్యక్తిని కదిలించినా చెప్పే మాట ఒకటే పదేళ్ల కింద తెలంగాణ ఎలావుంది? ఇప్పుడు ఎలా వుంది? హైదరాబాద్ లాంటి నగరంలో పదేళ్ల క్రితం ఎలా వుంది? ఇప్పుడు ఎలా వుంది? పాత బస్తీలోకూడా ఇదే మాట! పదేళ్ల క్రితం ఎప్పుడూ కర్ఫ్యూ తప్ప, ప్రగతిని చూసింది లేదు. విన్నది లేదని ప్రజలే చెబుతున్నారు. అంతే కాదు బిజేపి మత రాజకీయాలు, కాంగ్రెస్ కుటిల రాజకీయాలు చూసిన మైనార్టీ ప్రజలు తమను గౌరవిస్తున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్ అంటున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల ఎంతో సంతోషంగా బతుకుతున్నామంటున్నారు. గతంలో ఎక్కడ ఏ అలజడి జరిగినా ముస్లిం మైనార్టీలు బిక్కు బిక్కు మంటూ బతకాల్సివచ్చేది. కాని పదేళ్లుగా కర్ప్యూ వాతావరణం లేని పాతబస్తీలో ప్రశాంతతో బతుకుతున్నామంటున్నారు. ఇంతకన్నా ప్రజలు ఏం కోరుకుంటారు. ఇక పల్లె విషయానికి వస్తే ఒకనాడు పల్లె ఎలా వుందో గుర్తు చేసుకుంటే గుండె ఆవిరౌతుంది. అంతటి కష్టం రైతులు ఎదుర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో బోర్ల రాంరెడ్డి అనే వ్యక్తి వ్యవసాయం మీద వున్న మక్కువతో రైతుగానే బతకాలన్న కోరితో 100 బోర్లు వేసి వ్యవసాయం చేశాడు. కాని చుక్కనీరు రాకపోతే కన్నీటి సాగు చేశాడు. అటువంటి తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లే..కన్నీళ్లకు తావులేని ఊళ్లే…రైతు మోములో సంతోషమే…ఇదంతా కాంగ్రెస్ వల్ల సాద్యమయ్యేదా? అసలు కేసిఆర్ లేకుంటే తెలంగాణ ఉద్యమం జరిగేదా? ఇంకా వందేళ్లయినా తెలంగాణ రాకపోయేది. కాంగ్రెస్ ఇవ్వకపోయేది. తెలంగాణ బాగుపడకపోయేది. ఎడారిగా మారిన తెలంగాణ తప్ప, సస్యశ్యమల తెలంగాణ కనిపించేది కాదు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీక ముఖ్యమంత్రి కేసిఆర్. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణ కష్టం కరంటుతో తీరుతుందన గుర్తించారు. తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా సాగు కావాల్సింది కరంటు. ఆ కరంటు కష్టాలే తెలంగాణ రైతును చిద్రం చేశాయి. తెలంగాన సాగును చిన్నాభిన్నం చేశాయి. సీమాంధ్ర పాలకుల దాష్టికానికి తెలంగాణ చెరువులు ఆగమయ్యాయి. వారి నిర్లక్ష్యానికి చెరువులు మామయ్యాయి. మొత్తంగా తెలంగాణ సాగును, రైతును చెరపట్టించారు. అలాంటి కాలం నుంచి బంగారు తెలంగాణ సాధ్యమైందంటే కారణం ముఖ్యమంత్రి కేసిఆర్ అన్న భావన ప్రతి తెలంగాణ వ్యక్తిలోనూ వుంది. ఎందుకుంటే ఒకనాడు తెలంగాణలోని ఏ పల్లెకు వెళ్లి బాట లేదు. బాట పక్కన ఒక్క చెట్టు లేదు. చుట్టూ బీడు భూములు. పల్లెర్లు మెలిచిన పొలాలు. ఎటు చూసినా చుక్క నీరు లేదు. బాట సారులకు కూడా మంచినీటికి దిక్కులేదు. కాని ఇప్పుడు దారి మధ్యలో కనిపించే చెరువులన్నీ నిండుగా వుంటున్నాయి. చెరువులు నింపే కాలువలు ఎప్పుడూ నీటితో కళకళలాడుతున్నాయి. రోడ్డు కిరువైపులా పచ్చని పొలాలు, పాడి పంటలు దర్శమిస్తున్నాయి. బాటసారుల దాహర్తిని కూడా బోర్లు తీరుస్తున్నాయి. ఇరవై నాలుగు గంట కరంటుతో ఎటు చూసిన బోర్లనుంచి గంగమ్మ దుంకుతోంది. బంగారు పంటలు పండుతున్నాయి. ఇంతకాన్న సంతోషం ఏముంటుంది? ఇంతకన్నా ఆనందం ఏముంటుంది. సరిగ్గా పదేళ్ల క్రితం రైతు మీద కనికరంలో చినుకు చుక్క ఆకాశం నుంచి జారినా పెట్టుబడి లేక సాగు వదిలేసుకునేవారు. ఒక వేళ ధైర్యం చేసి అప్పు చేసి, సాగు మొదలుపెట్టినా సరైన సమయానికి చినుకు మొహం చాటేస్తే మొలకెత్తని విత్తనాలు పురుగుల పాలౌతుంటే చూసి రైతు వలవల ఏడ్చిన సందర్భాలే ఎక్కువ. విత్తిన నాడు చినుకు కురిసినా మొక్క భూమిని చీల్చుకొని బైటకు వచ్చినా తర్వాత చినుకు జాడ లేకున్నా రైతు పరిస్ధితి ఆగమ్య గోచరమే…ఇలా అడుగడుగు కష్టమే..దిన దిన గండంగా సాగు సాగించిన రైతు కడుపు నిండా ఏనాడు తిన్నది లేదు. కంటినిండా నిద్ర తీసింది లేదు. కడుపారా నవ్వింది లేదు. గుక్కెడు నీటితో దాహం తీర్చుకున్నది. ఎటు చూసినా అప్పుడు..ఆర్తనాదాలు..ఆకలి కేకలు…వేధింపులు…కష్టాలు ఒకదాని వెంటఒకటి పడి తరిమేస్తుంటే ముళ్లె సదురుకొని రాత్రికి రాత్రి దొంగల్లా ఊరు వదిలి వెళ్లిపోయిన రైతులు ఎంతో మంది. కాని ఆనాడు ఊరు విడిచి, ఇల్లు విడిచి వెళ్లిన వాళ్లంతా మళ్లీ తెలంగాణకు వచ్చారు. దర్జాగా వ్యవసాయం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధుతో సాగువాటు సాగిస్తున్నారు. చినుకు కోసం ఎదరుచూడాల్సిన పని లేదు. కాలమౌతుందా? అన్న దిగులు లేదు. ఒక పంట చేతికి రాగానే మరో పంట..ఇలా మొదలుపెడుతున్నాడు. ఏడాదికి ఒక్కొ రైతు మూడు పంటలు కూడా తీస్తున్నాడు. ఇదీ కదా తెలంగాణ…
అందుకే తెలంగాణలో ఈసారి కూడ కారే గెలవాలని, కారునే గెలిపించుకుంటామని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. తెలంగాణ వచ్చిన తార్వత కనిపిస్తున్న అభివృద్దిని కొనియాడని వారు లేరు. తెలంగాణ ఎంతో అభివృద్ది చెందినా,ఇంకా కొంత జరగాల్సి వుంది. అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ. అది కేసిఆర్ వల్లనే సాద్యమౌతుందని తెలంగాణ ప్రజల ప్రగాఢ విశ్వాసం. తెలంగాణ ప్రజలు బిజేపి, కాంగ్రెస్‌ను నమ్మేందుకు సిద్దంగా లేరు. తాజాగా జరిగిన కర్నాకట ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నదేమిటో ఆ మంత్రులే వచ్చి చెబితే, తెలంగాణ ప్రజలు చీ కొడుతున్నారు. తెలంగాణలో 24గంటల కరంటు ఇస్తుంటే, కర్నాకటలో 5 గంటలే ఇస్తున్నామని చెప్పి, కాంగ్రెస్ ఓట్లు అడగాన్ని ప్రజలు చీ కొడుతున్నారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా తెలంగాణ ప్రభుత్వ పరపతిని పెంచాయనే చెప్పాలి. రోజుకు ఇరవై నాలుగు గంటల కరంటు రైతులకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇస్తుందన్నది కూడా కాంగ్రెస్ నాయకులు అవగాహన లేదు. తెలంగాణలో సుమారు 30లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు వున్నాయి. కరంటు రాగానే ఒకే సారి అన్ని పంపు సెట్లు ఏక కాలంలో మోటార్లు మొదలైతే కరంటు ట్రిప్ అవుతుంది. పదే పదే కరంటు పోతుంది. నాణ్యమైన కరంటు రైతులకు అందదు. దాని ద్వారా మోటార్లు కాలిపోవడం వంటివి జరుగుతాయి. దాంతో రైతుల మీద అదనపు బారం పడుతుంది. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కష్టాలతో అష్టకష్టాలు పడిన రైతులు ఇంకా కష్టాల పాలు కావొద్దు. ఖర్చుల పాలు కావొద్దు. నాణ్యమైన విద్యుత్‌తో తిప్పలు లేని సాగు చేసుకోవాలి. మోటర్ కాలిపోతే దాన్ని బైటకు తీసి, రిపేర్‌కు పంపించి, తిరిగి తెచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది. రెండు రోజులు నీళ్లు లేకపోతే పొలం ఎండిపోతుంది. తర్వాత నీళ్లు అందనా కష్టమౌతుంది. అదే 24 గంటల కరంటు ఇస్తే, రైతులంతా ఒకేసారి విద్యుత్ వినియోగించుకోరు. ఎవరికి ఎప్పుడు వీలైతే అప్పుడు మోటార్లు ఆన్ చేసుకుంటారు. పొలం పారించుకుంటారు. ఇదీ అసలు కధ. ఈ సంగతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి కూడా తెలియకపోవడం విడ్డూరం. ఒకవేళ తెలిసినా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఖండిరచకపోవం అన్యాయం. ఇలాంటి కాంగ్రెస్ నాయకులను నమ్మి తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెట్టేందుకు ఏ ఒక్కరూ సిద్దంగా లేదు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసేందుకు సుముఖంగా లేరు.