భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణిలో పనిచేస్తూ మరణించిన కార్మిక కుటుంబాలకి అలాగే ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా కార్మికులందరికీ హెల్త్ కార్డులు సింగరేణి సంస్థ ఫ్రీగా ఇవ్వాలని తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ సింగరేణిని కోరారు.ఎన్నో సంవత్సరాలుగా గనిలో మనలో ప్రాణాలు ఓడ్డీ పనిచేసిన సింగరేణి కార్మికులకు ఈరోజు 20,000 40,000 కట్టి హెల్త్ కార్డు తీసుకోండి 8 లక్షల కి ఇస్తాం 10 లక్షల కి ఇస్తామని చెప్తున్నా సింగరేణి సంస్థ మాటలను వెనక్కి తీసుకొని పనిచేసిన ప్రతి కార్మికుడికి కార్మికుల కుటుంబానికి,మరణించిన కుటుంబాలకి,డిఫైన్డ్ కుటుంబాలకి,1996 నుంచి రిటైర్డ్ కుటుంబాలకి అందరికీ వైద్య సౌకర్యం సింగరేణి సంస్థని కల్పించాలని కోరుతున్నాం.డిస్మిస్
కార్మికులకు అన్ఫిట్ కార్మికులకు గోల్డెన్ షేక్ హ్యాండ్ కార్మికులకి రిటైర్డ్ కార్మికులకు వారసత్వ ఉద్యోగ కార్మికులకి మరణించిన కార్మిక కుటుంబాలకి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే ఏదైతే హెల్త్ కార్డు ఉందో ఆ హెల్త్ కార్డు ని సింగరేణి ప్రొవైడ్ చేయాలని మేము కోరుతున్నాం.1996 నుండి 2023 ఇప్పటివరకు 300 రూపాయలా పెన్షన్ మాత్రమే వస్తుందని దీని వలన వాళ్ళు ఎలా కుటుంబాలను పోషించుకుంటారు. ఇప్పటివరకు 80000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యారు. వీటిని దృష్టిలో పెట్టుకొని సింగరేణి మినిమం పెన్షన్ పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం.