భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలమహానాడు విస్తరణలో భాగంగా మాలమహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ఆదేశానుసారం. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో మాలమహానాడు సమావేశాన్ని గ్రామస్తులు నిర్వహించారు. ఈ సమావేశానికి మాలమహానాడు రాష్ట్ర సెక్రటరీ జనరల్ S. మధుసూదన్ రావు (చిన్ని )ముఖ్య అతిధిగా హాజరైనారు. ఎర్రగుంట గ్రామ మాలమహానాడు కమిటీ ని మధుసూదన్ రావు (చిన్ని )ప్రకటించారు.
ఈ సందర్బంగా మధుసూదన్ రావు (చిన్ని )ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాలమహానాడు ను బలోపేతం చేయాలనే దృక్పధంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని పట్టణ, గ్రామ కమిటీలను వేయడం జరుగుతుందన్నారు.ఇటీవల సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తున్నామని,
ఎస్సీ వర్గీకరణను విరామించుకునేవరకు పోరాటం ఆగదని, ఈ పోరాటంలో మీరుకూడ భాగస్వాములు కావాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలోమాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా త్వరలో పాదయాత్ర నిర్వహించడం జరుతుందని, మాలమహానాడు కార్యకర్తలు, విద్యార్డులు, యువకులు,మహిళలు అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
మాలల్లో ఐక్యత లేదని చెప్పే వాళ్ళ నోటికి ఈ పాదయాత్ర ద్వారా బుద్ది చెప్పాలని సూచించారు.ఎస్సీ. లను విడదీసి పబ్బం గడుపుకుంటున్న రాజకీయ పార్టీలు నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ఉద్బోదించారు.
కొత్తగూడెం పట్టణ మాలమహానాడు అధ్యక్షుడు శనగ ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు శనగ పుల్లయ్య
గుడివాడ నారాయణ, నక్కా నరసింహారావు తదితరులు ప్రసంగించారు.
ఎర్రగుంట గ్రామం
మాలమహానాడు కమిటీ
పాల్వంచ మున్సిపాలి
————————————
సలహాదారులు :
———————-
గుడివాడ నారాయణ
అధ్యక్షులు :
—————
సలవాది రత్నం
ఉపాధ్యక్షులు :
——————–
1.ద్రాక్ష మాణిక్యరావు
2 నక్కా నరసింహారావు
3.శెట్టి నరసింహారావు
ప్రధాన కార్యదర్శి :
————————
ద్రాక్ష సురేష్
సంయుక్త కార్యదర్సులు :
———————————
1.నిట్ట నరసింహారావు
2.బొజ్జ రాము
3.శెట్టి కమలాకర్
4.కురివిందల సీతారాములు
ముఖ్య ప్రచారకార్యదర్శి :
———————————
సూరం ఆదినారాయణ
ప్రచార కార్యదర్సులు :
——————————
1.సలవాది శంకర్
2.నక్కా వెంకటేశ్వర్లు
3.కోలుకుల రమేష్
కార్యవర్గ సభ్యులు
————————–
పెయ్యల వీరాస్వామి, ద్రాక్ష రాజు, కాంపాటి వెంకటేశ్వర్లు, నిట్ట రాము, శెట్టి దాసు, గోరింట్ల భాస్కర్, పసుపులేటి అశోక్, పసుపులేటి రవి, ఇర్రి బాబు, నక్కా సత్యం, బేత మల్ల బాబురావు, బేతం శాంసన్, గడ్డికొప్పుల రామారావు, కురివిందల సుదీర్, నిట్ట అఖిల్, కోలుకుల వెంకటేశ్వర్లు, కురివిందుల వేబకటేశ్వర్లు, కొలుకుల వెంకటేశ్వర్లు, గుండిపూడి రవి, దంకిట సురేష్, పసుపులేటి ప్రసాద్ లు నియమితులైనారు.