ఖీర్,సేమ్యా స్వీట్లను పంపిణీ చేసిన నాయకులు
పరకాల నేటిధాత్రి
పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ అలీ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్ ఉన్ నబి ఉత్సవాల సందర్భంగా బస్టాండ్ సెంటర్లో గల ఈద్గా మసీద్ వద్ద సోదరులకు సేమ్యా స్వీట్ పంచడం జరిగింది.అనంతరం కార్యక్రమానికి అతిధిగా వచ్చిన మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డిని,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ని ముస్లిం సోదరులు షాలువాతో సత్కారించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,కౌన్సిలర్ మడికొండ సంపత్,పర్నేం మల్లారెడ్డి, దబాసి వెంకటస్వామి, పల్లెబోయిన శ్రీనివాస్,అల్లం రఘు నారాయణ,దాసరి బిక్షపతి,దుగ్యాల రాజేశ్వరరావు,ఎండి అఫ్జల్,ఖలీమ్,అఫ్రోజ్,సమీర్,మజార్ అలీ,మన్చూర్ అలీ, ఇమ్రాన్,గౌస్,అస్రామ్,షఫీ, ఖాసిం,మచ్చ సుమన్,నాగరాజు, రవికుమార్,సదన్ కుమార్, ముస్లీం మత గురువులు పెద్దలు ముస్లిం సోదరులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.