*కోహిర్ మున్సిపల్ ఎన్నికలు: ఎంఐఎం విజయం అసదుద్దీన్ కు బహుమతి*
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కోహిర్ మున్సిపాలిటీ లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినొద్దీన్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కోహిర్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించి, పార్టీ జెండా ఎగురవేయాలని, ఈ విజయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి బహుమతిగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మొహమ్మద్ సలావుద్దీన్ మొహమ్మద్ సమీర్ పల్వాన్ మొహమ్మద్ ఇస్సా ఎంఐఎం పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో కోహిర్ లో ప్రజాబలంతో ఎక్కువ మున్సిపల్ కౌన్సిలర్లు గెలుస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
