మరణం ఎప్పుడో చెప్పిన ఏఐ!
పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
కన్ను తెరిస్తే జననం.. -కన్ను తెరిస్తే మరణం.. రెప్పపాటు జీవితం అంటారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఒక బిడ్డ ఏ రోజు. ఏ సమయానికి, ఎన్ని నిమిషాలకు పుడతారో కూడా అంచనా వేయచ్చు. కానీ, ఇప్పటికే సమాధానం చెప్పలేక పోయిన ప్రశ్న ఏంటంటేం ఎప్పుడు చనిపోతారు? ఫలనా వ్యక్తి మరణించేది ఎప్పుడు? నిజానికి ఈ ప్రశ్న అడగితే అందరూ వితగా చూస్తారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఆ ప్రశ్నకు
కూడా సమాధానం చెబుతుంది.
మనిషి ఎప్పుడు చనిపోతాడు? తన జీవితం మొత్తంలో ఎంత సంపాదిస్తాడు? ఎవరి జీవితకాలం ఎంత? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమే. కానీ వీటికి శాస్త్రవేత్తలు సమాధానం కనుగొన్నారు! సైన్స్ కు టెక్నాలజీ జోడించి మరణాన్ని అంచనా వేసే ఏఐ టూల్ ను రూపొందించారు. 78 శాతం కచ్చితత్వంతో ఇది పనిచేస్తుందని తేలింది. వ్యక్తుల వివరాలు, అలవాట్లు, పద్ధతులు తదితర సమాచారాన్ని ఉపయోగించుకొని మరణాన్ని అంచనా వేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ను సిద్ధం చేశారు.
డెన్మార్క్, అమెరికా శాస్త్రవేత్తలు కలిసి ‘లైఫ్ 2వెక్’ అనే ఏఐ మోడల్ ను రూపొందించారు. ఇది చాట్ జీపీటీ తరహాలో పనిచేస్తుంది. ఇతర మోడళ్ల తరహాలో కాకుండా చాట్ బాట్ మాదిరిగా యూజర్లతో నేరుగా సంభాషించి సమాచారం సేకరిస్తుంది. మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ ను ఉపయోగించి ఈ ఏఐ మోడల్ కు విస్తృతమైన డేటాను అందించారు. ఆదాయం, వృత్తి, వివాసం ఉండే చోటు, ప్రెగ్నెన్సీ హిస్టరీ, గాయాలు తదితర సమాచారంతో కూడిన 60 లక్షల మంది వ్యక్తుల వివరాలను దీనికి ఇచ్చారు. ఓ వ్యక్తి ఎంత త్వరగా చనిపోయే అవకాశం ఉంది? వారి జీవిత కాలంలో సంపాదించే ఆదాయం ఎంత? వంటి విషయాలను ఇది అంచనా వేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ మోడల్ ప్రకారం మగవారు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, నైపుణ్యం కలిగిన వృత్తిలో ఉన్నవారు త్వరగా చనిపోయే అవకాశం ఉంది. అలాగే అధిక ఆదాయం… నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారు ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంది. అయితే ఇలాంటి టెక్నాలజీవి అందుబాటులోకి తీసుకురావాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరగాలి. అప్పుడే ఆ టెక్నాలజీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో, ఇలాంటి టెక్నాలజీ
మనకు అవసరమో కాదో తెలుస్తుంది.
దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.