
రైస్ మిల్లు నుండి వచ్చే దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం సమీపంలో కాశింపల్లి గ్రామం మధ్యలో ప్రజలు నివసించే దగ్గరలో మంజునాథ ఆగ్రో ఇండస్ట్రీ మోడ్రన్ రైస్ మిల్లును నిర్మించారు. రైస్ మిల్లు చుట్టూ ప్రహరీ గోడ లేకుండా చెట్లు పెంచకుండా ఇష్టానుసారంగా రైస్ మిల్లును యజమాని నడిపిస్తున్నారు. దాని నుండి వచ్చే దుమ్ము దూలికి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని స్థానిక ప్రజలు రైస్ మిల్లు యజమానికి తెలియజేసిన ఏమాత్రం పట్టించుకోకుండా మిల్లును నడిపిస్తున్నారని ఆరోపించారు. ఆ రోడ్డులో ద్విచక్ర వాహనాలు వెళ్లేటప్పుడు కళ్ళలో దుమ్ము పడి యాక్సిడెంట్ అయిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు పాటించు కోకుండా ఊరి మధ్యలో రైస్ మిల్లును నిర్మించి అమాయకపు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు.ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసిన ఏమాత్రం పట్టించుకోలేదని ప్రజలు వాపోయారు. ప్రజల అనారోగ్యానికి గురి చేస్తున్న రైస్ మిల్లును మూసేయాలంటూ స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు