ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతు కార్మికుల ఆవేదన

భద్రాచలం నేటి ధాత్రి

కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ అన్నారు అనంతపురం సతీష్ మాట్లాడుతూ . మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను మోడీ పరిష్కరించలేదు. కార్పొరేటు మతతత్వ విధానాలను అనుసరిస్తూ సామ్రాజ్యవాదం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరించింది . రైతులు పండించిన పంటకు MSP ఇస్తామన్న హామీని తుంగలో తొక్కింది , నిరుద్యోగం ధరల పెరుగుదల పేదరికం ఆకలి మొదలైన కీలక అంశాలను పరిష్కరించకుండా దీని నుంచి తప్పించడానికి ప్రజలను పక్క దారి పట్టించే వైఖరిని చేపట్టింది.ఇందులో భాగమే రామ మందిరం .2024 పార్లమెంట్ ఎన్నికలలో ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజల సిద్ధం కావాలని ముసలి సతీష్ పిలుపునిచ్చారు ఈ నెల 16న జరిగే భారత్ బంద్ లో రైతులు వ్యవసాయ కార్మికులు లక్షలాదిగా పాల్గొనాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో నరేష్ సమ్మక్క నాగరాజు రాజు బాయమ్మ బీమా లక్ష్మి సారయ్య సంజయ్ కమల సరిత నాగేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!