లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన “ఏఈ”

*”నేటిధాత్రి” జనగాం*

*బిల్లులపై సంతకం చేయడానికి రూ.6 వేలు లంచం తీసుకుంటూ నీటిపారుదలశాఖ ప్రత్యేక సహాయక ఇంజినీరు(ఏఈ) అనిశాకు చిక్కారు.*

*అనిశా వరంగల్‌ రేంజి డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంటతండా పంచాయతీ ప్రత్యేకాధికారిగా నీటిపారుదలశాఖ ఏఈ గుగులోత్‌ గోపాల్‌ పనిచేస్తున్నారు.*

*ఈ క్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు బానోత్‌ యాకుబ్‌ పంచాయతీ పరిధిలో రూ.1.27 లక్షల విలువ చేసే పనులను పూర్తి చేసి బిల్లులను గ్రామ కార్యదర్శికి సమర్పించారు. ఆయన వాటిని పరిశీలించి, నిర్ధారించారు.*

*ఈ బిల్లులకు డబ్బులు చెల్లించేందుకు ప్రత్యేకాధికారి కౌంటర్‌ సంతకం కావాల్సి రావడంతో గోపాల్‌ను సంప్రదించారు. రూ.6 వేలు ఇస్తేనే సంతకం చేస్తానని ఆయన చెప్పడంతో యాకుబ్‌ అనిశా అధికారులను సంప్రదించారు.*

*దీంతో నిఘా ఉంచిన అధికారులు సోమవారం హనుమకొండ నక్కలగుట్ట వద్ద యాకుబ్‌ నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా గోపాల్‌ను పట్టుకున్నారు. విచారణ పూర్తయిన తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!