
భూపాలపల్లి, నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా సీనియర్ సివిల్ కోర్టు కు అడిషనల్ జిపిగా బల్ల మహేందర్ ను నియమిస్తూ తెలంగాణ లా సెక్రటరీ, గవర్నమెంట్ లీగల్ లెజిస్లేటివ్ అఫ్ఫైర్స్ అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ నుండి ఉత్తర్వులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ద్వారా నియామక పత్రాన్ని అందుకున్నారు. బల్ల మహేందర్ ఏజిపి గా నియామకం కావడం పై పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ నాపై నమ్మకం తో నా నియామకానికి సహకరించిన ఐటి శాఖ మంత్రి దుడ్డిల్ల శ్రీధర్ బాబు భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకి పిసిసి మెంబర్ చల్లూరి మధు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కి, తోటి న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.