అదృశ్యశక్తుల అండ ఉంది మాకు అడ్డెవడు…?
నేటిధాత్రి బ్యూరో : ఆయనగారు ఓ కార్పోరేటర్ భర్త మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయి వ్యాపారంలో దివాలాతీసి దిక్కుతోచని స్థితిలో ఉండేవాడు. ఏ ‘అల్లాఉద్దీన్ అద్భుత దీపమో’ దొరికి ప్రస్తుతం కోట్లకు పడగలెత్తాడో అనుకుని పిక్స్ అయిపోకండి. కేవలం పేద ప్రజల భూములు కబ్జా చేసి తినడానికి తిండి లేని వారిని ఏదోరకంగా బురిడి కొట్టించి, దివాళా తీసిన కార్పోరేటర్ భర్త కాస్త ప్రస్తుతం వంద ఎకరాలకు పైగా ఆస్తులకు అసామిగా మారాడు. వందల రూపాయలు లేని స్థితి నుంచి వందల కోట్ల ఆస్తులకు నేనే యజమానిని అంటున్నాడు. కేవలం భూమి కొన్నట్లు భయాన పత్రాలు సృష్టించి కోట్ల విలువ చేసే భూములు కొల్లగొడుతున్నాడు. ఇదేంటని బాధితుల పక్షాన ప్రశ్నిస్తే దృశ్య ప్రపంచం కన్న అదృశ్య ప్రపంచం చాలా పెద్దదని పరోక్షంగా వార్నింగ్‌లు ఇస్తున్నాడు. తన కబ్జాల వెనుకా అదృశ్యంగా చాలా పెద్ద చేతులే ఉన్నాయి ఖబర్ధార్…అంటున్నాడు. 14మందిమి కలిసి ఈ దందాలకు పాల్పడుతున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాడు. భూమి ఎవరివైనా వదిలేది లేదని…ఎవరు అడిగిన బెదిరిస్తామని డంబాలు కొడుతున్నాడు.
పూర్తి వివరాలు త్వరలో…