ఎస్సీ హాస్టల్ తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్
మహాదేవపూర్ నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మహదేవపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ ని అడిషనల్ కలెక్టర్ ఎల్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేసినారు. వారు హాస్టల్లో పిల్లలకు పోషకాహారం అందిస్తున్న తీరు అడిగి తెలుసుకున్నారు, ఎగ్స్ నాణ్యత పరిశీలించారు. మరియు హాస్టల్ ఆవరణను కలియతిరిగి పరిశుభ్రతను తనిఖీ చేసినారు. హాస్టల్ వార్డెన్ తో మాట్లాడుతూ పిల్లలకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని, నాణ్యమైన ఎగ్స్ మాత్రమే పిల్లలకు ఉడకబెట్టి అందించాలని, హాస్టల్ ఆవరణ కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించినారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కేటాయించి విద్యార్థుల చదువుపై దృష్టి కేంద్రీకరించాలని ఈ సందర్భంగా హాస్టల్ యజమాన్యానికి సూచిస్తూ ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలని ప్రత్యేకంగా తెలియజేశారు విద్యార్థులందరూ ఎప్పటికప్పుడు తగిన శుభ్రతలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.వారి వెంట మహదేవపూర్ ఎంపీడీవో ఏ. రవీంద్రనాథ్ ఉన్నారు.
