అధికార కండువాలే మాకు ముఖ్యం

https://epaper.netidhatri.com/view/243/netidhathri-e-paper-23rd-april-2024%09/3

`కార్యకర్తను బలి చేస్తాం… మళ్లీ కొత్త కండువాలు కప్పి మా జెండాలు మొపిస్తాం …అధికారంలో మాత్రం మేమే ఉంటాం..

`అధికారం కోసం వంద రోజులు ఆగక పోతిరి.!..కార్యకర్తలను బలి చేసి కండువా కప్పు కుంటిరి.!

పార్టీల వైఖరితో ఇరుకున పడుతున్న కార్యకర్తలు

`నిజమైన కార్యకర్తలకు తప్పని ఇబ్బందులు

`అధిష్టానాల అధికార రాజకీయాల్లో బలిపశువులవుతున్న వైనం

`ఆత్మగౌరవం దెబ్బతిని, ఆత్మవిశ్వాసం కోల్పోతున్న కార్యకర్తలు

`ప్రజాస్వామ్యంలో కొత్త పరిణామంతో సరికొత్త ఇబ్బందులు

`దిశారహిత రాజకీయాలవైపు ప్రజాస్వామ్యం

`‘లౌక్యం’ దిశగా కార్యకర్తలు మళ్లాల్సిన పరిస్థితి

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రజాస్వ్యామంటేనే ప్రజల భాగస్వామ్యానికి పెద్దపీట వేసే వ్యవస్థ. కానీ దేశ, రాష్ట్ర రాజకీయాల ను పరిశీలిస్తే ప్రజాస్వామ్య నిర్వచనమే మారిపోతోంది. అధికార పరమావధి, కెరీర్‌కు ప్రాధాన్య మిచ్చే రాజకీయాల్లో, నిబద్ధంగా పార్టీని అంటిపెట్టుకొని పనిచేస్తున్న కార్యకర్తలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి అయోమయానికి గురవుతున్నారు. ఉన్న సారాయే సీసాలు మారుతోంది తప్ప, కొత్త నీరు రావడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తల సమస్యలపై ఈ కథనం.
సైద్ధాంతిక ప్రాతిపదికన రాజకీయాలు నెరపడం అనేది కాలగతిలో చరిత్రపుటల్లో కలిసి పోయి, కేవలం రాజకీయాలను తమ కెరీర్‌ అభివృద్ధికి ఒక సాధనంగా చూసే రోజులు వచ్చేశాయి.
ప్రజాస్వామ్యంలో ఈ మార్పు ఆరోగ్యకరమా లేక ఆనారోగ్య ధోరణా అన్న మాట అట్లా ఉంచితే, గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్న రాజకీయ పార్టీలు ఏ అభ్యర్థివల్ల తమకు విజయావకాశాలుంటాయన్న బేరీజుతో పావులు కదుపుతుండటం ఈ వర్త మాన పరిణామానికి ప్రధాన కారణమన్నది మాత్రం అక్షరసత్యం. ఈ రాజకీయ భేతాళ పంచవింశతిలో కొన్ని నష్టాలు, కొన్ని లాభాలు రెండూ ఉన్నాయి. దేని పాలు అధికమనేది ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మారుతుంటుంది. అయితే వాటిల్లుతున్న నష్టం ఆయా పార్టీల కార్యకర్తలకు మాత్రమేనన్నది సుస్పష్టం! ప్రస్తుత రాజకీయ పరిణామల్లో బి.ఆర్‌.ఎస్‌, భాజపా, కాంగ్రెస్‌ లేదా మరే ఇతర పార్టీల్కెనా గతంలో తాము అనుసరించిన వ్యూహాల్లో సమూల మార్పులు తీసుకొచ్చాయి. ఈ మార్పుల ప్రతికూల ప్రభావం మొద ట్నుంచీ పార్టీని నమ్ముకొని, జెండాలు మోసి పాటుపడిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నా యకులపై ప్రధానంగా పడుతోంది. ఈ మార్పు వల్ల సైద్ధాంతికత కనుమరుగైపోయి, సం క్షేమం పేరుతో విచ్చలవిడిగా తాయిలాలు పంచడం, బుజ్జగింపు అనే రాజకీయ ధోరణులు మొదలయ్యాయి. ఇది క్రమంగా గెలుపు గుర్రాలు లేదా బలమైన నాయకులను ఆక ర్షించే దశకు తీసుకెళ్లడం, రాజకీయాలను ఒక కెరీర్‌గా మలచుకోవడానికి దారితీసింది. ఫలితంగా సిద్ధాంతం స్థానాన్ని, సంక్షేమం పేరుతో విచ్చలవిడి ‘ఉచితాలు’ ఆక్రమించేశా యి. సమాజంలో బలీయమైన ఓటుహక్కు ఉన్న వర్గాలకు పరిమితికి మించిన ‘ఉచితా’లను ప్రకటించడమే కాదు, ఆయా వర్గాలకు చెందిన నాయకులకు పార్టీలు ప్రాధాన్యత నివ్వడం, దీనివల్ల కలిగిన తాజా పరిణామం.
ఈ విపరిణామాల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తల ఎదుర్కొంటున్న దుస్థితి గురించి! సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకొని, జెండాను మోసి, అనుకూల ప్రచారం చేసిన కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు ఆయా పార్టీల అధిష్టానాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకోసం తీసుకునే నిర్ణయాలవల్ల క్షేత్ర స్థాయిలో విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఎన్నికల సీజన్‌ దగ్గరపడే కొద్దీ బలమైన నాయకుల ఎంపిక అనేది ‘ఐ.పి.ఎల్‌ వేలం’ మాదిరిగా మారిపోయింది. తమ పార్టీలో టిక్కెట్‌ దొరకని నాయకులు వేరే పార్టీలవైపు చూడటం, తమ పార్టీలో సరైన నాయకులు లేరని భావించిన పార్టీలు ఇతర పార్టీలనుంచి గట్టి నాయకులను ఆకర్షించడానికి ప్రయత్నించడం సర్వసాధారణం కావడం, దిశా రహిత రాజకీయాలకు దారితీసింది. ఫలితంగా ఏనాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి! క్షేత్రస్థాయి కార్యకర్తలు తాము ఒకప్పుడు వ్యతిరేకంగా ప్రచారం చేసిన నాయకులకు అనుకూలంగా ఓట్లడుగుతూ ని యోజవర్గాల్లో తిరగాల్సిన పరిస్థితికి ఈ పరిణామాలు దారితీస్తున్నాయి. ఉదాహరణకు గత ఎన్నికల్లో భారాసా తరపున పోటీచేసిన అభ్యర్థి ఇప్పుడు టిక్కెట్‌ దొరక్క లేదా మరే ఇతర కారణంవల్లనో కాంగ్రెస్‌లోనే భాజపాలోనే చేరి ఎన్నికల బరిలో దిగితే, గత ఎన్నికల్లో సదరు నాయకుడికి అనుకూలంగా ప్రచారం చేసిన కార్యకర్తలు ఇప్పుడు ఆయనకు వ్యతి రేకంగా ప్రజల్లోకి వెళ్లి ఏవిధంగా ప్రచారం చేయగలుగుతారు? ‘అధిష్టాలనాల రాజకీయ వైకుంటపాళి’లో ఈవిధమైన సంకట పరిస్థితిని కార్యకర్తల నెత్తిమీదికి తెచ్చిపెట్టే వైఖరి విచిత్రమే!
తెలంగాణలో తామే ప్రత్యేక రాష్ట్రం తెచ్చామని భారాసా చెబుతుంది లేదు తామే తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్‌ వాదిస్తుంది.
మా సహాయం లేకుండా ప్రత్యేక రాష్ట్రం సాధ్యమయ్యేదా అని భాజపా అంటుంది! ఇక్కడ ముగ్గురి వాదనా కరక్టేననుకుందాం. ప్రస్తుతం ఈ మూడు పార్టీల మధ్య నాయకులు మార్పిడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాలను కెరీర్‌గా భావించే నాయకులు, అధికారమే పరమావధిగా రాజకీయాలు నడిపే పార్టీల వల్ల ఈ పరిస్థితి దాపురించింది. అయితే ఈ ‘మార్పిడు’ల వల్ల ఈ పార్టీలకు చెందిన క్షేత్రస్థాయి కార్యకర్తల్లో అయోమయం నెలకొంటున్నది. ఎప్పుడు ఎవరికి అనుకూలంగా ప్రచారం చేయాలో తెలియని దుస్థితి! ఒకప్పుడు తాము తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడే ఇప్పుడు తమ నెత్తినెక్కి కూర్చుంటే, కక్కలేక మింగలేక స్తబ్దంగా ఉండలేక కార్యకర్తలు తీవ్ర మనోవ్యధకు లోనవుతున్నారు. ఈవిధంగా తాము ఒకప్పుడు వ్యతిరేకించిన వారికి ఇప్పుడు అనుకూలంగా, ఒకప్పుడు అనుకూలంగా వ్యవహరించినవారికి ఇప్పుడు వ్యతిరే కంగా ప్రచారం చేయాల్సి రావడం కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. మానవ శరీరానికి ‘అస్తిపంజరం’, భవనానికి ‘స్టీలు’ ఎంతటి దృఢత్వాన్ని ఇస్తాయో, పార్టీకి కార్యకర్తలు కూడా అంతే! వారి ఆధారంపైనే పార్టీల మనుగడ ఆధారపడి వుంటుంది. ముఖ్యంగా సైద్ధాంతిక నిబద్ధతపై పార్టీలు కొనసాగినప్పుడు, ఆయారాం గయారాంల సంఖ్య తక్కువగా ఉండేది. కానీ ‘కెరీర్‌ రాజకీయాలు’ ఆధిపత్యం వహిస్తున్ననేటి కాలంలో ‘సిద్ధాంతాల’ స్థానాన్ని ‘అధికారం’ ఆక్రమించింది. ఈ నేపథ్యంలో పార్టీల కార్యకర్తలు తప్పనిసరి పరిస్థితుల్లో తమ ప్రచార వ్యూహాలను కూడా మార్చుకోవలసి వస్తోంది. ఏ నాయకుడిని వ్యతిరేకించకుండా, తమ నాయకుడికి అనుకూలంగా ప్రచారం చేసుకోక తప్పడంలేదు. తమ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నాడని గుడ్డిగా అతనికి పూర్తి వ్యతిరేక ప్రచారం చేస్తే, రేపు ఆయనే తమపార్టీలో చేరినట్లయితే తమ పరిస్థితేంటనేది ఆలోచిం చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అందువల్లనే కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు ‘లౌక్యం’గా వ్యవహరించడం కనిపిస్తోంది. కానీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం, చేరిన కొత్తనాయకు లు వారి అనుచరగణం ఆధిపత్యం, మొదట్నుంచీ పార్టీని నమ్ముకున్న పార్టీలకు పెను సంకటంగా మారింది. ఫలితంగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ‘కెరీర్‌’కు ప్రాధాన్యం ఇచ్చే నాయకులు తమతోపాటు తమకు నమ్మకస్తుల్కెన వారిని కూడా వెంటబెట్టుకు వెళు తుంటారు. వీరు కొత్తగా చేరిన పార్టీలో తమ నాయకుడి అండ, అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇచ్చిన దన్నుతో స్థానిక కార్యకర్తలపై ఆధిపత్యం అవసరమైనే జులుం ప్రదర్శిస్తుండటం వర్తమాన చరిత్ర!
ఈ పరిణామాలు ఆయా పార్టీల అధినాయకత్వాలకు తెలియవా?
అంటే తప్పక తెలుసుననే సమాధానం వస్తుంది. కానీ వారి పరస్థితి వారిది! అధికారం పరమపద సోపానమైన ప్పుడు ఈ పరిణామాన్ని ఆహ్వానించక తప్పదు. ఇక్కడ వారికి కార్యకర్తలు కాదు, గెలిపించే దమ్మున్న నాయకుడు ముఖ్యం! సదరు నాయకుడు ఆ భారాన్ని నెత్తిన వేసుకున్నప్పుడు ఇక కార్యకర్తలతో పనేంటి? నిజంగా ఇది విచిత్ర పరిస్థితి! ఈ పరిణామాలు క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కూడా గాలివాట అనుకూల వైఖరిని ప్రోత్సహిస్తున్నాయి. అంటే ఎవరూ ఎవరికీ వ్యతిరేకం కాదు! అంతా మనవాళ్లే! పార్టీ ప్రధానం కాదు, భవిష్యత్తు ప్రధానం! ప్రజాస్వామ్యంలో చోటుచేసుకుంటున్న ఈ విపరిణామం వల్ల కొత్తవారికి ఛాన్స్‌ మాట అట్లా వుంచి, ఉన్న నాయకులే వేర్వేరు పార్టీల జెండా కింద పోటీచేయడం, వున్న కొద్దిమందిలోనే ఎవరినో ఒకరిని ఎన్నుకోవాల్సి రావడం ప్రజలెదుర్కొంటున్న దుస్థితి! ఇక్కడ సీసాలు పాతవే, సారా పాతదే…కాకపోతే సారా సీసాలు మారుతుంది! అంతే! ఇటువంటి పరిస్థి తుల్లో కార్యకర్తలు రాజకీయాల్లో ఎదగడం చాలా కష్టమే! వీరు తమ మనుగడకోసం రంగులు మార్చే రాజకీయాలకు అలవాటు పడితే తప్ప, ఈ వైకుంఠపాళిలో ‘పాము కాటు’ కు గురికాక తప్పదు. దురదృష్టవశాత్తు నిబద్ధత కలిగిన కార్యకర్తలకు ఇదే అనుభవం ఎదురవుతోంది! ఫలితంగా కార్యకర్త అనే పదానికి ‘నిర్వచనం’ మారిపోతున్నది. ప్రజాస్వా మ్య మనుగడ, దాని దిశ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇది మంచికా, చెడుకా అన్నది కాలం నిర్ణయించాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *