హన్మకొండ / నేటి ధాత్రీ
నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ అశ్విని తానేజి వాకడే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ తో పాటు వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ను కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి నీటి సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ ఇంటెక్ వెల్ ను కమిషనర్ పరిశీలించారు. వరంగల్ నగరానికి నీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు.