జవాబు పత్రాలు అమ్ముకుంటున్న వారి పైన చర్యలు తీసుకోవాలి

ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్

కాకతీయ యూనివర్సిటీలో జవాబు పత్రాలు అమ్ముకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగటమాడుతున్న వారి పైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా జవాబు పత్రాలు అమ్ముకుంటున్న వారి వెనకాల ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంబేద్కర్ విద్యార్థి సమాఖ్య ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో ఎగ్జామినేషన్ బ్రాంచ్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ గత కొంతకాలంగా పరీక్షల జవాబు పత్రాలు అమ్ముకుంటూ యూనివర్సిటీ పరువు తీస్తున్న కాకతీయ యూనివర్సిటీ దినసరి కూలీల పైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఎంతో మంది విద్యార్థులు కష్టపడి చదువుకొని పరీక్షలు రాస్తుంటే కొంతమంది విద్యార్థులు అడ్డదారిగా పాస్ కావాలని చూస్తున్నా వారికి దినసరి కూలీలు డబ్బుల కోసం జవాబు పత్రాలు అమ్ముకుంటూ నిజాయితీగల విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం జరిగిందని ఒక జవాబు పత్రం ఐదు వేయిల రూపాయలకు అమ్ముకోవడంతో నిజాయితీగల విద్యార్థులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురైందని అన్నారు ఇన్చార్జి విసి మరియు రిజిస్ట్రార్ స్పందించి జవాబు పత్రం నమ్ముకున్న వారి వెనకాల ఎవరైతే ఉన్నారో వారి పైన కఠినమైన చర్యలు తీసుకొని విద్యార్థులు న్యాయం చేయాలని అన్నారు లేనియెడల యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుద్దామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏ బి ఎస్ ఎఫ్ కేయూ ఇన్చార్జి మచ్చ పవన్ కళ్యాణ్ యూనివర్సిటీ అధ్యక్షులు దూడపాక నరేందర్ ప్రధాన కార్యదర్శి బండారి పృథ్వీరాజ్ ప్రదీప్ రత్నాకర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!