ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తికాక ముందే వచ్చే విద్యాసంవత్సర ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల పై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి
ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు
చేర్యాల నేటిధాత్రి…
కొన్ని ప్రయివేట్ విద్యాసంస్థలు ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తికాక ముందే వచ్చే విద్యాసంవత్సరం కోసం ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల పై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర కార్యదర్శి పుల్లని వేణు డిమాండ్ చేశారు.
ఈ విషయమై పుల్లని వేణు మాట్లాడుతూ.. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటూ విద్యను వ్యాపారం చేస్తు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ విద్యాసంస్థలకు మద్దతు పలుకూతున్నారని అకాడమిక్ ఇయర్ పూర్తికాకముందుకే వచ్చే సంవత్సరం అడ్మిషన్లు కూడా ఇప్పటినుండి ప్రారంభిస్తూ కింది స్థాయి ఉద్యోగులకు కమిషన్లు ఇస్తూ అడ్మిషన్లు అత్యధికంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అలాంటి ప్రైవేట్ విద్యా సంస్థలను సీజ్ చేయాల్సిందిగా ఏఐఎస్పీగా డిమాండ్ చేస్తున్నాం ఉన్నారు.