
ఏ.ఐ.ఎస్.బి జిల్లా కమిటీ డిమాండ్
నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ జిల్లా పోచమ్మమైదాన్ వేణురావు కాలనీలో అనుమతి లేకుండా నడుస్తున్న ఏకశిల జూనియర్ కళాశాలను సీజ్ చేయాలి అని ఏ.ఐ.ఎస్.బి వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏ.ఐ.ఎస్.బి నాయకులు రోహిత్, ప్రవీణ్ లు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి లేకుండా నగర నడిబొడ్డున దర్జాగా ప్రజలను మోసం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఏకశిలా యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా నడుస్తున్న ఏకశిలా బ్రాంచ్ ను వరంగల్ జిల్లా డి.ఐ.ఈ.ఓ తక్షణమే సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు వరంగల్ వేణురావు కాలనీకి చెందిన ఏకశిలా బ్రాంచ్ లో తమ పిల్లలకు అడ్మిషన్ తీసుకొని తమ పిల్లల భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని వారు కోరారు. తక్షణమే విచారణ చేపట్టి జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు ఈ బ్రాంచ్ ను సీజ్ చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మోహన్, నితిన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.