నారింజ నీటి కలుషిత కారకులపై చర్యలు తీసుకోవాలి,,!
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో కొత్తూర్ గ్రామములో ఉన్నది కానీ అతిపెద్ద సాగు నీటి చెరువు నారింజ ప్రాజెక్టు. మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మాజీ నరోత్తం, మా ట్లాడుతు ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు 3000 ఎకరాల ఆయాకట్టును నిర్థారించారు కానీ ప్రభుత్వ అలసత్వం వల్ల కాలువలు బాగాలేనందున ఆయకట్టుకు నిరందడం లేదు ఈ ప్రాజెక్టులో నీటి నిలువల వల్ల చుట్టుప్రక్కల 12 గ్రామాలలో భూగర్భజలాలు పెంపొందినాయి,మొన్న నారింజను పరిశీలిస్తే అందులో ఉన్న నీరంత రంగు మారి కలుషిత మైనట్లు కనిపిస్తున్నది,ఈ నీరు కలుషితానికి కారణం అల్లానా వ్యర్థ జలాలో లేదా పురపాలక డ్రైనేజీ వాటరో కలవడం వల్ల జరిగినట్లు కనిపిస్తున్నది, చుట్టూ ప్రక్కల వాకబు చేయగా పశువుల కూడా ఆ నీరు త్రాగడం లేదని ప్రజలు చేప్పుతున్నారు.ఈ రోజు ఇంత వేసవిలో కూడా ఈ ప్రాజెక్టులో నీరు సమృద్ధిగా ఉన్నాయి.ఈ ప్రాజెక్టులో ఇతర వ్యర్థ జలాలు కలవకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది,తక్షణమే కాలుష్యనియంత్రణ అధికారులు ఆ నీటిని పరిశీలించి నీటి కాలుష్యానికి కారణమైన సంబందిత వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఆ ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టి లోతును పెంచి ప్రాజెక్టులో నీటి నిలువను పెంపొందించాల్సిందిగా డిమాండ్ ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలరాజ్ , జైపాల్, తదితరులు ఉన్నారు.