ప్రభుత్వ ఎంక్వైరీలో ‘‘సినీ గద్దలు’’ తిన్న సొమ్ము.
448,985,273.00.

44 కోట్ల 89 లక్షల 85 వేల273 రూపాయలు.
`చిత్రపురి గద్దల నిర్ణయం?

`ప్రభుత్వం ఏంచేస్తుందో మేమూ చూస్తాం?
`మేం చేతులు ముడుచుకొని కూర్చొం?

`అవినీతి పరుల రహస్య సమావేశం?
‘‘నేటిధాత్రి’’ కి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం?
`ప్రభుత్వ నివేదిక తప్పుల తడక! పనికి రాని చిట్టా?
మాపై ప్రభుత్వం కక్ష సాధించాలని చూస్తే సహించం?
`చిత్రపురి అవినీతి గద్దల ప్రేలాపనలు?
అవినీతి పరులంతా కలిసి మాట్లాడుతున్న మాటలు?
`గత పదేళ్లలో కనిపించని అవినీతి ఇప్పుడు కనిపించిందా?
`ఆరోపణలు చేసేవారు చేస్తూనే వుంటారు?
`విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే వుంటారు?
`అవన్నీ నిజం కాదు! మాకేం భయం లేదు?
`అన్ని కోర్టులోనే చూసుకుంటాం?
`మూడేళ్లలో పోయే ప్రభుత్వం మనల్ని ఎం చేస్తుంది?
`స్టే ఆర్డర్ వచ్చిన తర్వాతే మాట్లాడతాం?
`బరితెగించిన అవినీతి గద్దలు?
`ప్రభుత్వనికే సవాలు విసురుతున్నారు?
`ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులు నష్టపోతారు?
`చిత్రపురి గద్దలందరికి రో హౌస్‌లున్నాయి?వాటిని కూల్చేస్తే వారి మదం అనుగుతుంది?
`అవినీతి పరుల ఆస్తులు జప్తు చేస్తేనే బలుపు తగ్గుతుంది?
`కార్మికుల కష్టం దొబ్బి తిన్నారు?
`కార్మికుల రక్తం తాగారు?
`సుద్దపూసల్లా మాట్లాడుతున్నారు?
సిగ్గు శరం వదిలేసి బలుపు మాటలు మాట్లాడుతున్నారు?
`హైడ్రా ను రంగంలోకి దింపితే తప్ప తప్పు ఒప్పుకోరు?
`ప్రభుత్వాన్నే సవాలు చేసి పెద్ద తప్పు చేశారు?
రూపాయి కట్టం..కోర్టుకు పోతాం…నోటీసులిచ్చారు. ఏం చేస్తారో చూద్దాం..ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఈ లోగా కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుందాం! ఇల్లు అలకగానే పండుగ కాదు. నోటీసులిచ్చినంత మాత్రాన బెదిరిపోవాల్సిన పనిలేదు. ఈ ప్రభుత్వం వుండేది ఇంకా మూడేళ్లే..గత పది సంవత్సరాల కాలంలో గత పాలకులకు కనిపించనిది ఈ ప్రభుత్వానికి కనిపించిందా? ప్రభుత్వం కక్ష సాదింపు చర్యలు చేపట్టాలని చూస్తున్నట్లుంది. ప్రభుత్వం చేసిన, ఎంక్వైరీ, ఇచ్చిన నివేదిక అంతా తప్పుల తడక.. మన తఢాకా కూడా ప్రభుత్వానికి చూపిద్దాం..మనమంటే ఏమిటో తెలియజేద్దాం..మన జోలికి వచ్చి ప్రభుత్వం ఎంత తప్పు చేసిందో కూడా చెబుదాం..? ఇది ఎవరో అన్న మాటలు కాదు. సాక్ష్యాత్తు చిత్ర పురిలో పాతకుపోయి, కార్మికుల కష్టం దోచుకొని, వారికి అందాల్సిన స్ధలాలను కొట్టేసిని గజదొంగలు అంటున్న మాట. కార్మికుల సొమ్ముదిగమింగిన గద్దలు రహస్య సమావేశంలో చర్చించుకుంటున్న మాటలు. నేటిధాత్రికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ రాబంధులు సమావేశం ఏర్పాటు చేసుకొని కోర్టులోనే తేల్చుకుందా? అంటూ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుందామని మాట్లాడుకున్నమాటలు. ప్రభుత్వాన్నే హెచ్చరిస్తూ, మాట్లాడుకుంటున్నారు. తమను ముట్టుకుంటే ఏం జరుగుతుందో కూడా చూపిద్దామనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం ఎంత దూరం వెళ్తుందో మనమూ చూద్దాం…మనమేం చేతులు ముడుచుకొని కూర్చుంటామా? అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా లాతో కొట్టాలని సమాలోచనలు సాగించినట్లు సమాచారం. ఏకంగా ప్రభుత్వం రూపొందించిన నివేదికనే తప్పుల తడక అంటూ ఎద్దేవా చేసున్నారు? అది పనికి రాని చిట్టా అంటూ హళన చేస్తున్నారు? కార్మికుల కోసం పనిచేశాం..తామేమీ ఊరికే పనిచేయడానికి సంఘ సంస్కర్తలమా? నాయకులు తినడం లేదా? పాలకులు తినడం లేదా? ప్రభుత్వం మీద ఆరోపణలు రావడం లేదా? అవన్నీ నిజాలు తేలాలంటే, నిగ్గు తేల్చాలంటే ఎంత కాలమౌతుందో తెలియంది కాదు? ఇప్పుడు మనం నోరు తెరవాల్సిన పనిలేదు. ఎవరికీ సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకూ సమయం వస్తుంది? ఎవరెవరికి ఎలా సమాధానం చెప్పాలో అదీ చెబుదాం..? పాలక పక్షంలో వున్న వారు మనతో ఏం మాట్లాడారో, విచారణ చేసిన వారు ఏం సాదిస్తారో చూద్దామంటున్నారట? ప్రభుత్వాలు చేసే విచారణలు,నివేదికలు అన్నీ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే వుంటాయి? అంత మాత్రానికి ఆగం కావాల్సిన పనిలేదు? ఏదో తిన్నట్లు? ఎంతో కన్నం పెట్టినట్లు? లెక్కలు కాగితాల మీద లెక్కలేస్తే సరిపోతుందా? మాటలు చెబితే నిజమౌతుందా? మనల్ని ప్రశ్నించేంత పెద్ద వాళ్లు ఎవరూ లేరు? మనం రంగంలోకి దిగితే రాజకీయాలే వేరు అన్నట్లు మాట్లాడుకుంటున్నారట? ఏ పనుల మీదైనా సరే మాట్లాడేవారు మాట్లాడుతూనే వుంటారు? ఆరోపణలు చేస్తూనే వుంటారు? విమర్శలు సాగిస్తూనే వుంటారు? అంత మాత్రాన కంగారు పడాల్సిన పనిలేదు. మన జోలికి వచ్చేంత దైర్యం ఎవరూ చేయరు? ఇదంతా కొంత హడావుడి కోసమే తప్ప ఏమీవుండదు? ఇదీ చిత్ర పురి గద్దలు చెబుతున్న మాట. ఏకంగా ప్రభుత్వ నివేదికనే తప్పు పడుతున్నారు? ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నారు? ఒక రకంగా ప్రభుత్వానికే సవాలు విసురుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. గత పాలకులు వదిలేశారని, ప్రజా ప్రభుత్వం వదిలేయాలనేమీ లేదు. దొంగలకు శిక్ష పడక తప్పదు. ఊరుకుంటే ఇంకా ఇంకా అవినీతి చేస్తూనే వుంటారు. చేయాల్సినదంతా చేసి, చల్లగా తప్పుకున్నారు? ఎప్పుడో జరిగిన విషయాల మీద ఇప్పుడు నిందలేమిటి? నివేదికలేమిటి? లెక్కలేమిటి? లెక్కల్లో బొక్కలేమిటి? అని గద్దలు మాట్లాడుకుంటున్నారు? అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం వుంది. లేకుంటే చిత్రపురిని నిండా ముంచి గజ దొంగలు మరింత రెచ్చిపోతారు? ఇంకా ఇంకా కార్మికులను ముంచుతారు? చిత్రపురిని పూర్తిగా హస్తగతం చేసుకుంటారు? అవినీతికి ఎక్కడో పుల్‌స్టాప్ పడాలి. చిత్రపురిలో పడిన దొంగల నుంచి దోచుకున్నదంతా ప్రభుత్వం కక్కించాలి? వసూలు చేయాలి. కార్మికుల కల నెరవేర్చాలి. దశాబ్దాలు గడుస్తున్నా కార్మికుల కల నెరవేరలేదు. కాని చిత్రపురిని నిండా ముంచి ఈ గద్దలు మాత్రం అనుమతులు లేని రో హౌజ్‌లు నిర్మాణం చేసుకున్నారు. ఒకటికి రెండు అంతస్దుల విల్లాలు నిర్మాణం చేసుకున్నారు. కార్మికులను నడి రోడ్డు మీద నిలబెట్టారు. కార్మికులకు చెందిన భూమిలో కార్మికుల సొమ్ము లూటీ చేసిన గద్దలకు ఇండ్లు ఎలా వచ్చాయి? ఎవరు అనుమతులిచ్చారు? ఎలా రోహౌజ్‌లు నిర్మాణం చేసుకున్నారు? అనేది తేలాల్సిన అవసరం వుంది. ముందుగా ఆ రోహౌజ్లన్నీ కూల్చివేయాలి. అందులో వున్న గద్దలను తరిమేయాలి. వారి ఆస్దులు జప్తు చేసి ప్రభుత్వం ఆ సొమ్ము కార్మికులకు ఇండ్లు నిర్మాణం చేయించాలి. ఆ ఇండ్లను కూలిస్తే గాని చేసిన పాపం గుర్తుకురాదు. ఎక్కిన మదం వారికి దిగిపోదు. కార్మికుల సొమ్ము స్వాహా చేసిన వారు ఒక్కరు, ఇద్దరు కాదు. ఇరవై మంది గద్దలున్నారు. వారిలో కొమర వెంకటేష్, ఎం. వినోద్ బాల, పిఎస్. కృష్ణ మోహన్‌రెడ్డి, సినిమాలలో నీతి ముచ్చట్లు రాసే అవినీతి రాతగాడు పరుచూరి వెంకటేశ్వరరావు. నిర్మాత, దర్శకుడు, కార్మికుల నాయకుడు అని గొప్పలు చెప్పుకునే తమ్మారెడ్డి భరద్వాజ, కే. రాజేశ్వర్ రెడ్డి, దేవినేని బ్రహ్మానంద, చంద్రమధు, కే.ఉదయ్ బాస్కర్, కొల్లి రామకృష్ణ, రఘు బత్తుల, వి. ప్రవీణ్ కుమార్, కాదంబరి కిరణ్ కుమార్, ఏ. మహానంద రెడ్డి, వల్లభనేని అనిల్, వి. ప్రవీన్యాదవ్లున్నారు. వీళ్లంతా కలిసి రూ.44,89,85,273 కోట్లు దిగమింగినట్లు ప్రభుత్వం నివేదిక తయారు చేసింది. దానిని కూడా ఈ గద్దలు తప్పంటున్నారు. తమ మదాన్ని చూపిస్తున్నారు. కార్మికులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. హైడ్రాను రంగంలోకి దింపాలి. కోర్టు నుంచి స్టే ఆర్డర్ రాకముందే రోహౌజ్‌లను కూల్చివేయాలిన కార్మికులు కోరుతున్నారు. లేకుంటే కోర్టు నుంచి స్టే ఆర్డర్ వస్తే మాత్రం ఈ దొంగలు కార్మికులను మరింత ఇబ్బందుల పాలు చేస్తారు. కార్మికుల సొమ్ము దొబ్బి తిని బలిసి కొట్టుకుంటున్నారు. కార్మికుల రక్తం తాగి ఆస్దులు కూడబెట్టుకున్నారు. ఇప్పుడు సేవ చేసినట్లు, కార్మికులకు మేలు చేసినట్లు, సుద్ద పూస ముచ్చట్లు చెబుతున్నారు. సిగ్గూ శరం వదిలేశారు. సమాజం దృష్టిలో దోషులుగా ముద్ర పడినా నవ్విపోదురుగాక మాకేంటి అనుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలకు ఆదేశించాలని కార్మికులు కోరుతున్నారు. కార్మికుల పక్షాన ఇంత కాలం నిలబడి పోరాటం చేసిన వాళ్లు సూచిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి సీరియస్‌గా దృష్టిపెట్టాలని కార్మికులు వేడుకుంటున్నారు. చిత్రపురిలో జరిగిన అవకతవకలు వెలుగులోకి వచ్చేలా చూసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంలో మరోసారి చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. కార్మికుల సొమ్ము అప్పనంగా మింగి ప్రభుత్వం మీదకు కాలు దువ్వుతున్న వారి నుంచి తిన్నదంతా కక్కించకపోతే ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయిందన్న సంకేతాలు పంపినట్లౌవుతాయి. తమను ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయిందని ఆ గద్దలు మరింత చెప్పుకొని తిరగడమే కాకుండా, ఇంకా ఇంకా కార్మికులను మోసం చేయడానికి అవకాశమిచ్చినట్లౌవుతుంది.
