
సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు డాక్టర్ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రదానం..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
విధి నిర్వహణలో, సమాజ సేవలో విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ కు ఆచార్య దేవో భవ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 136వ జయంతి పురస్కరించుకొని యువ తేజం ట్రస్టు , కలాం విజన్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మాజీ రాష్ట్రపతి దివంగత వి.వి గిరి మనుమడు జి. సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో విశేషాలు సేవలందించిన ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ, కర్నాటక, తమిళనాడుకు చెందిన 136 మంది ఉపాధ్యాయులకు ఆచార్య దేవో భవ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రదానం చేశారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల కు చెందిన ఎస్ జి టి ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ కు,భారత రత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనుమడు జి.సుబ్రహ్మణ్యం ఆచార్య దేవో భవ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దేవరకద్ర మండలంలోని లక్ష్మీ పల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం వ్యక్తం చేశారు.