దశాబ్దాల కాలంగా తెలంగాణ ప్రజలకు అభివృద్ధిలో ముందుకు సాగనివ్వని పాలకుల దగ్గర ప్రజలను ఐక్యం చేసి రాష్ట్రాన్ని సాధించి ప్రజలు కోరకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి అముల చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ చేసిన అభివృద్ధి చూసి పరిషత్ ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్ధులను గెలిపించాలని శాసనసభ్యుడు అరూరి రమేష్ అన్నారు. శుక్రవారం మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల ఎన్నికల ఇంచార్జీ ఇల్లందుల సుదర్శన్ అధ్యక్షతన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా మండలంలోని చెన్నారం,ఉప్పరపల్లి,నల్లబెల్లి,ల్యాబర్తి,కొత్తపల్లి గ్రామల్లో జెడ్పీటీసి అభ్యర్ధి మార్గం భిక్షపతితో కలిసి ఆయా గ్రామాల ఎంపిటిసి అభ్యర్ధులతో ప్రచారం నిర్వహించారు. ఈసంధర్భంగా ప్రచార కార్యక్రమానికి హాజరైన ఆయా గ్రామాల ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు దివించాలని కోరారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో ముందు నుండి ఉద్యమించి పార్టీ నాయకత్వాన్ని నమ్మి ఇంత వరకు నిలిచిన నాయకుడు మార్గం భిక్షపతిని జెడ్పీటిసి అభ్యర్ధిగా ప్రజలపై నమ్మకంతోనే మీ ముందుకు పంపిందని అన్నారు. అదే విధంగా పార్టీ నిర్ణయాలు,ప్రజలు కోరకున్న వ్యక్తులకే ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్ధులుగా ఖరారు చేసినట్లు అరూరి తెలిపారు. మండలంలో 11 స్థానాలకు గాను ఇప్పటికే 2 స్థానాలు ఎకగ్రీవం ఆయ్యాయని మిగతా 9 స్థానాలకు 9 స్థానాలు టీఆర్‌ఎస్ అభ్యర్ధులు విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మార్నేని రవిందర్‌రావు,జెడ్పీటీసి పాలకుర్తి సారంగపాణి,మాజీ మార్కెట్ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచ్‌లు,పార్టీ ఎన్నికల ఇంచార్జీలు,పార్టీ ముఖ్యనాయకులు,ప్రజలు పాల్గోన్నారు.