అంత్యక్రియలకు ఆర్థిక సాయం..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం లోని చోక్కంపేట్ గ్రామపంచాయితీలో బ్యాగారి రత్నామ్మ(70) అనారోగ్యంతో మరణించారు.
ఆమె మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి.
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంచాల కృష్ణయ్య, గ్రామ మాజీ కో ఆప్షన్ అజీమోద్దీన్, మాజీ వార్డుమెంబెర్ బోయ రాజు, అవులమంద వెంకటేష్, మంచాల మల్లేష్, నత్తి కృష్ణయ్య, మంచాల శాంతయ్య, మంచాల రాజు, బోయ వెంకటయ్య, మంచాల నర్సింహులు, నరిగే ఎల్లయ్య, గ్రామస్తులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.